PoliticalRangareddyTelangana

గ్యాస్ పైప్‌లైన్ వివాదంపై పెంజర్ల సర్పంచ్ జగన్ సంచలన ఆరోపణలు

గ్యాస్ పైప్‌లైన్ వివాదంపై పెంజర్ల సర్పంచ్ జగన్ సంచలన ఆరోపణలు

గ్యాస్ పైప్‌లైన్ వివాదంపై పెంజర్ల సర్పంచ్ జగన్ సంచలన ఆరోపణలు

ఉప సర్పంచ్ శంతన్ రెడ్డి డబ్బులు డిమాండ్ చేశారంటూ “ఆడియో విడుదల”..

శాంతన్ రెడ్డి వార్డుకు 20వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు కాంట్రాక్టర్ సంభాషణ

ఉన్నతాధికారుల అనుమతులతోనే పైప్ లైన్ పనులు

పెంజర్ల గ్రామ ఉప సర్పంచ్ శంతన్ నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు..

అభివృద్ధి పనులను అడ్డుకోవడం సరికాదు

దళితుడిననే చిన్నచూపుతోనే ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన

షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు సి కె న్యూస్ ప్రతినిధి సెప్టెంబర్ 24

కొత్తూర్ మండల పరిధిలోని పెంజర్ల గ్రామంలో గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటుపై నెలకొన్న వివాదం తీవ్రస్థాయికి చేరింది. తనపై ఉప సర్పంచ్ శంతన్ రెడ్డి, మరికొందరు చేస్తున్న ఆరోపణలను సర్పంచ్ ఎర్రోళ్ల జగన్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఉన్నతాధికారుల అనుమతులతో జరుగుతున్న అభివృద్ధి పనులను కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ వివాదానికి సంబంధించి సర్పంచ్ జగన్ కాంట్రాక్టర్‌తో మాట్లాడిన ఆడియోను మీడియాకు విడుదల చేయడంతో గ్రామంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఆ ఆడియో సంభాషణలో కాంట్రాక్టర్ నవీన్ గౌడ్ చెప్పిన వివరాల ప్రకారం, గ్యాస్ పైప్‌లైన్ పనులకు ప్రభుత్వం, సంబంధిత ఉన్నతాధికారుల నుంచి అవసరమైన అనుమతులు ఉన్నాయని సర్పంచ్ జగన్ కు ఫోన్ ద్వారా తెలిపారు. పనులు ప్రారంభించిన కొద్దిసేపటికే కొందరు వచ్చి పనులను అడ్డుకున్నారని, పని కొనసాగిస్తే రాళ్లతో కొడతామని బెదిరించినట్లు కాంట్రాక్టర్ చెప్పినట్లు సర్పంచ్ జగన్ వెల్లడించారు. అదే ఆడియోలో ఉప సర్పంచ్ శంతన్ రెడ్డి వార్డుకు సుమారు రూ.20 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు కాంట్రాక్టర్ చెప్పిన విషయాన్ని సర్పంచ్ జగన్ ప్రస్తావించారు. డబ్బులు ఇస్తేనే పనులు సజావుగా సాగుతాయన్నట్టుగా ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు.గ్రామంలో గ్యాస్ పైప్‌లైన్ ఏ మార్గంలో ఏర్పాటు చేయాలన్న అంశంపైనా వివాదం తలెత్తినట్లు జగన్ తెలిపారు. డబ్బులు ఇస్తే గ్రామం మధ్య నుంచి పైప్‌లైన్ వెళ్లేందుకు అనుమతిస్తామని, లేకపోతే గ్రామం బయట నుంచి తీసుకెళ్లాలని కొందరు చెప్పినట్లు ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రోళ్ల జగన్ మాట్లాడుతూ, “గ్రామ సర్పంచ్‌గా చట్టబద్ధమైన అభివృద్ధి పనులకు సహకరించడం నా బాధ్యత. ప్రభుత్వ అనుమతులతో జరుగుతున్న పనులను అడ్డుకోవడం సరికాదన్నారు. నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఉప సర్పంచ్ రెడ్డి చేస్తున్నారనీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టించకూడదనీ స్పష్టం చేశారు. బెదిరింపులకు భయపడకుండా నిబంధనల ప్రకారం పనులు జరిగేలా చూస్తాం” అని స్పష్టం చేశారు. “ప్రజాస్వామ్యంలో దళితుడు సర్పంచ్‌గా ఉండకూడదా?” అని జగన్ ప్రశ్నించారు. తాను దళితుడిననే కారణంతోనే తనపై చిన్నచూపు చూస్తూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్యాస్ పైప్‌లైన్ వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలకు వాస్తవాలను ప్రజల ముందుంచేందుకే ఆడియోను విడుదల చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడం, బెదిరింపులకు పాల్పడటం వంటి ఆరోపణలపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని సర్పంచ్ జగన్ కోరారు. గ్యాస్ పైప్‌లైన్ వివాదానికి సంబంధించి విడుదలైన ఆడియో ఇప్పుడు పెంజర్లలో తీవ్ర చర్చకు దారితీస్తోంది

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button