AdilabadPoliticalTelangana

రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్!

రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్!

రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్!

Web desc : నిర్మల్ జిల్లా కేంద్రంలో భైంసా మున్సిపల్ కమిషనర్ సంతోష్ కుమార్ లంచగొండితనం బయటపడింది. యాభై వేల లంచం తీసుకుంటుడగా భైంసా మున్సిపల్ కమిషనర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు.

ఒక కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుడగా ఏసీబీ అతనిని పట్టుకుంది. లక్ష రుపాయలు డిమాండ్ చేసి యాభై వేలు తీసుకున్న కమిషనర్ నిర్వాకం బయటపడింది. భైంసా మున్సిపల్ కమిషనర్ జాదవ్ సంతోష్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు మంగళవారం రోజున దాడులు నిర్వహించారు.

ఒక వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా భైంసా ఇన్ ఛార్జ్ కమిషనర్ సంతోష్ జాదవ్ కారును సినీ ఫక్కిలో వెంబడించి పట్టుకున్నారు. భైంసాలో ఓ కాంట్రాక్టర్ కు చెందిన 2 లక్షల 60 వేల బిల్లు మంజూరు చేసే విషయంలో 50 వేల రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.

నిర్మల్ లోని ఓ హోటల్ వద్ద 50 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం ఇంచార్జ్ కమిషనర్ ను ఏసీబీ అధికారులు ఇంటికి తరలించి విచారణ చేపడుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button