KarimnagarPoliticalTelangana

ఎమ్మెల్యే పేరు చెప్పి రూ.4లక్షలు డిమాండ్ చేసిన్రు..కాంగ్రెస్ లీడర్ సంచలన ఆరోపణ

ఎమ్మెల్యే పేరు చెప్పి రూ.4లక్షలు డిమాండ్ చేసిన్రు..కాంగ్రెస్ లీడర్ సంచలన ఆరోపణ

ఎమ్మెల్యే పేరు చెప్పి రూ.4లక్షలు డిమాండ్ చేసిన్రు..కాంగ్రెస్ లీడర్ సంచలన ఆరోపణ

Web desc : మానకొండూర్​ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేరుచెప్పి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్​ కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు బండారి రమేశ్, నర్సింగాపూర్​సర్పంచ్​రూ.4లక్షలు డిమాండ్​చేశారని శంకరపట్నం మండలం అంబాల్పూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్​ నాయకుడు గొల్లెన తిరుపతి తీవ్ర ఆరోపణలు చేశాడు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను తిమ్మాపూర్ మండలం పొలంపల్లి గ్రామంలోని సర్వే నంబర్-69లో మట్టి తవ్వకాల కోసం మైనింగ్ శాఖ నుంచి తాత్కాలిక పర్మిట్ పొందానన్నారు. గత అక్టోబర్ 7నుంచి డిసెంబర్ 5వరకు పర్మిషన్​ ఉండగా, అక్టోబర్ 10న పనులు ప్రారంభించామని చెప్పారు.

పని ప్రారంభించిన కొద్ది రోజులకే కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు బండారి రమేశ్​, నర్సింగాపూర్ సర్పంచ్ పెరిక రవి కలిసి ‘ఎమ్మెల్యే డబ్బులు అడుగుతున్నారు.. పని జరగాలంటే రూ.4 లక్షలివ్వాలి’ అని డిమాండ్ చేయడంతోపాటు అక్టోబర్ 14న నర్సింగాపూర్ సర్పంచ్ తనను ఇంటికి పిలిపించుకొని బెదిరించారని చెప్పారు.

మొదటగా ఫోన్​ పేలో కొంత అమౌంట్​ పంపానని, మరికొంత నగదు రూపంలో మొత్తం 2 లక్షలు ఇచ్చానని చెప్పారు. మిగతా డబ్బులు ఆలస్యం కావడంతో తనను మానసికంగా వేధించి, మైనింగ్, రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి తన పర్మిట్లను రద్దు చేయించి, తన టిప్పర్లను నిలిపివేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ లీడర్లు బ్లాక్ దందా చేసే వారికి వత్తాసు పలుకుతూ రాత్రికిరాత్రే మట్టిని తరలించుకునేలా చూస్తున్నారని ఆరోపించాడు. ​ తనకు జరిగిన అన్యాయంపై ఎమ్మెల్యేతో పాటు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు కల్పించుకొని తనకు న్యాయం చేయాలని కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button