HyderabadPoliticalTelangana

నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్‌.. నేనూ చేస్తా.. మల్‌ రెడ్డి రంగారెడ్డికి కాలనీ అధ్యక్షురాలు సవాల్‌

నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్‌.. నేనూ చేస్తా.. మల్‌ రెడ్డి రంగారెడ్డికి కాలనీ అధ్యక్షురాలు సవాల్‌

నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్‌.. నేనూ చేస్తా.. మల్‌ రెడ్డి రంగారెడ్డికి కాలనీ అధ్యక్షురాలు సవాల్‌

Web desc : కాలనీని అభివృద్ధి చేయమని అడిగేందుకు వెళ్తే తన ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలని అన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి కాలనీ మహిళా ప్రెసిడెంట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ విషయమై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మాది ఇంజాపూర్ పరిధిలోని శ్రీరంగాపురం కాలనీ (24వ వార్డు).

నన్ను అందరు కలిసి ఎన్నుకున్నారు అందరూ కలిసి నన్ను కాలనీ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నరు.. ఆదివారం మా ఎమ్మెల్యే దగ్గరికిపోయినం.. మేం ఓట్లేసి గెలిపించిన మా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి దగ్గరకు మేమంతా మహిళలు 25 మంది కలిసి పోయినం.. సార్ మా కాలనీ అభివృద్ధి చేయండి.. మా దగ్గర ఒక్క సీసీ రోడ్డు లేదు.. మా కాలనీ మొత్తం వెనక పడిపోయింది.

మా కాలనీలో రోడ్లు లేవు.. స్కూల్ బస్సులు పోయేందుకు లేదు.. ఆడవాళ్లు కూరగాయలకు వెళ్లేందుకు లేదు.. మా కాలనీ అభివృద్ధి చేయండి.. సీసీ రోడ్లు వేయండి అని అడిగినం. నువ్వు కాలనీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయి అని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అంటున్నడు.. మహిళలు ప్రెసిడెంట్ పదవులకు పనికి రారా..? మహిళల ఓట్లు నీకొద్దా..అంటే నేను మహిళనేనా..? అని ప్రశ్నించారు.

నేను ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తే ఆయన రోడ్లు వేస్తడట.. ప్రెసిడెంట్ పదవికి రోడ్లకు సంబంధమేంటి..? మమేం ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే అని ఆశీర్వాదం తీసుకుందామని.. 25 మందిని తీసుకొని పోతే నువ్వు కాలనీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయంటున్నవ్ కదా.. నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి.. నేను మా కాలనీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తా అని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి సదరు కాలనీ ప్రెసిడెంట్ సవాల్ విసిరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button