Hyderabad
Trending

రాజకీయ నాయకుల కంటే ప్రభుత్వ అధికారులే అవినీతిపరులు!

రాజకీయ నాయకుల కంటే ప్రభుత్వ అధికారులే అవినీతిపరులు!

రాజకీయ నాయకుల కంటే ప్రభుత్వ అధికారులే అవినీతిపరులు!

అధికారుల తీరుపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: సి.కె. న్యూస్ ప్రతినిధి

ప్రభుత్వ అధికారుల అవినీతి, లంచగొండితనంపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకుల కంటే ప్రభుత్వ అధికారులే ఎక్కువగా అవినీతికి పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అధికారుల వ్యవహారశైలి కారణంగా ప్రజా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అసహనం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి సంబంధించిన పని చేయాలని తాను ఓ అధికారిని కోరినప్పటికీ ఆ అధికారి పని చేయలేదని తెలిపారు. అయితే అదే వ్యక్తి రూ.15 వేల లంచం ఇవ్వగానే ఆ అధికారి పని పూర్తి చేశారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులు చెప్పినా పట్టించుకోకుండా, డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్న అధికారుల తీరు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తోందని విమర్శించారు.

అధికారులు లంచాలు తీసుకోవడం వల్లే తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రోడ్ల నిర్మాణ పనులు చేపట్టే కాంట్రాక్టర్ల నుంచి 20 శాతం వరకు కమీషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల కారణంగానే కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు రావడం లేదని పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రజలకు పారదర్శకమైన పాలన అందించాలని ప్రయత్నిస్తుంటే, కొందరు అధికారుల లంచాల వ్యవహారం ప్రభుత్వ లక్ష్యానికి విఘాతం కలిగిస్తోందని ఎమ్మెల్యే వ్యాఖ్యలు రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

అధికారుల అవినీతిపై ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సంబంధిత శాఖలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button