
ప్రమాదంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని కాపాడిన చింతకాని రైల్వే సిబ్బంది
మానవత్వమే ముందుగా.. విధి నిర్వహణలోనే మరో ప్రాణానికి రక్షణ
ప్రయాణికులను గమ్యానికి చేర్చడమే కాదు.
ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచిన రైల్వే సిబ్బంది.
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
చింతకాని: రైల్వే సిబ్బంది అప్రమత్తత ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. విధి నిర్వహణలో భాగంగా రైల్వే ట్రాక్‌ను పరిశీలిస్తున్న సిబ్బంది మానవత్వాన్ని చాటుతూ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి సకాలంలో వైద్య సహాయం అందేలా చర్యలు చేపట్టారు. శనివారం 21-11-2026 న వరంగల్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న రైలులో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి 35 కిందపడి తలకు తీవ్ర గాయాలై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిని చింతకాని రైల్వే సిబ్బంది గుర్తించారు. వెంటనే స్పందించిన సిబ్బంది రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో పాటు అత్యవసర సేవలైన 108కు సమాచారం అందించారు. క్షతగాత్రుడికి సకాలంలో వైద్య సహాయం అందేలా చర్యలు చేపట్టి ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడేలా కీలకంగా వ్యవహరించారు.
రైల్వేలో విధులు అంటే కేవలం ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడం మాత్రమే కాదు.. ప్రమాదాలు, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు క్షణాల్లో స్పందించి ప్రాణాలను కాపాడటం కూడా తమ బాధ్యతేనని చింతకాని రైల్వే సిబ్బంది మరోసారి చాటిచెప్పారు. నిత్యం రైల్వే ట్రాక్‌లపై ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది.. ప్రమాదాల ముప్పు పొంచి ఉన్నప్పటికీ అప్రమత్తతతో వ్యవహరిస్తూ అనేక సందర్భాల్లో ప్రయాణికులకు, ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఈ ఘటనలోనూ తమ విధి నిర్వహణకు మానవత్వాన్ని జోడించి ఓ నిండు ప్రాణాన్ని కాపాడేందుకు చూపిన చొరవపై స్థానికులు, ప్రయాణికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.




