KhammamPoliticalTelangana

గుడిసెల్లో జీవనం.. ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులట!....

గుడిసెల్లో జీవనం.. ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులట!....

గుడిసెల్లో జీవనం.. ఇందిరమ్మ ఇళ్లకు అనర్హులట!….

ఇల్లు కూలి కాలిపోయినా కనికరం లేదా..? 20 ఏళ్లుగా తండాలో ఉంటున్నా గుర్తింపు లేదా?…..

ఇస్లావత్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై నిరుపేదల ఆవేదన…..

కమిటీల నిర్ణయాలపై బాధితుల ప్రశ్నలు

సి కె న్యూస్ ప్రతినిది తిరుమలాయపాలెం

ఒకవైపు పూరి గుడిసె.. మరోవైపు పశువుల కొట్టం.కష్టాల మధ్య జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు అందని ద్రాక్షగా మారిందనే ఆవేదన ఇస్లావత్ తండాలో వ్యక్తమవుతోంది. గతంలో నివసించిన ఇల్లు కూలిపోయి, అగ్నిప్రమాదంలో కాలిపోవడంతో ప్రస్తుతం తల్లిగారి ఇంట్లో ఆశ్రయం పొందుతున్న కుటుంబానికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం లేదని బాధితులు వాపోతున్నారు.

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుమారు 20 ఏళ్లుగా తండాలోనే స్థిర నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నామని, తమకు రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయనే కారణంతో స్థానికంగా ఇల్లు ఇవ్వలేమని కమిటీ సభ్యులు చెబుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

గ్రామంలో సర్పంచి ఉన్న కానీ సర్పంచ్ మాటను కూడా జవదాటి మాజీ సర్పంచి మాటలే వేదంగా అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారని అధికార పార్టీ అండదండలతో మాజీ సర్పంచ్ ఏకపక్ష నిర్ణయాలతోఇందిరమ్మ కమిటీలను తన గుప్పట్లో పెట్టుకుని ఇష్టం వచ్చిన రీతిలో తనకు అనుకూలంగా ఉన్నవారికిస్తున్నారని బాధితులు ప్రారంభిస్తున్నాను. స్థానికంగా నివసిస్తున్న తమ పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా పత్రాల ఆధారంగా అనర్హులుగా చూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

గుడిసెల్లో ఉంటే అర్హత లేదా?….

ఒకవైపు పూరి గుడిసెలో కుటుంబ నివాసం, మరోవైపు పశువుల కొట్టం.. ఇలాంటి దుస్థితిలో ఉన్నా ఇందిరమ్మ ఇంటికి అర్హత లేదని చెప్పడం తమను కలచివేస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిజమైన నిరుపేదల కోసమే కాదా? అర్హత పొందాలంటే ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, పెద్దపెద్ద భవనాలు ఉండాలా? గుడిసెల్లో జీవించే పేదలకు ఇళ్లు ఇవ్వరా? అంటూ నిలదీస్తున్నారు.

కమిటీలదే తుది నిర్ణయమా?….

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక విషయంలో కమిటీలు చెప్పిందే తుది నిర్ణయమని అధికారులు చెబుతున్నారని, అధికారులు చెప్పిందే తుది నిర్ణయమని కమిటీ సభ్యులు అంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో తమ సమస్యను వినే దిక్కు లేకుండా పోయిందని వాపోతున్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు, క్షేత్రస్థాయిలో అమలవుతున్న విధానానికి మధ్య వ్యత్యాసం కనిపిస్తోందని అంటున్నారు.

శీనన్నా.. మా పరిస్థితి చూడవా?….

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని చెబుతుండగా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని బాధితులు గుర్తుచేస్తున్నారు.

కానీ ఇక్కడ మాజీ సర్పంచ్ గా ఉంటూ అధికారాన్ని చేతులో పట్టుకొని గ్రామాన్ని ఇష్టారాజ్యంగా పరిపాలిస్తున్నాడని తాను చెప్పిందే వేదమని ఆమె చెప్పిన వాళ్ళకి ఇందిరమ్మ ఇప్పిస్తామని ఎవరైతే తన మాట వినరో వారికి ఇందిరమ్మ ఎన్ని ఇవ్వమని బాధితులు ఆరోదిస్తున్నారు మాజీ సర్పంచిగా గతంలో పనిచేసిన నాయకుడు ఇప్పుడు తన ఆధిపత్యాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడని గ్రామంలో అధికారులను తన గుప్పెట్లో పెట్టుకుని నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇవ్వకుండా కానీ అనర్హులంటూ పట్టిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అలాంటప్పుడు తమలాంటి నిరుపేద కుటుంబాలకు ఎందుకు న్యాయం జరగడం లేదని ప్రశ్నిస్తున్నారు.

తమ నివాస పరిస్థితులను స్వయంగా పరిశీలించి, ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరుతున్నారు. రాజకీయాలు, వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా నిజమైన నిరుపేదలను గుర్తించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అధికారులు స్పందించాలి.. అర్హతలను పునఃపరిశీలించాలి! ఇస్లావత్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై వస్తున్న ఆరోపణలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

బాధిత కుటుంబాల నివాస పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు, స్థానిక నివాస వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హతలను పారదర్శకంగా పునఃపరిశీలించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకం నిజమైన నిరుపేదలకు చేరినప్పుడే దాని లక్ష్యం నెరవేరుతుంది. గుడిసెల్లో బతుకుతున్న పేదల కన్నీళ్లు తుడిచే బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button