EducationKhammamPoliticalTelangana

శతాబ్ది వైభవానికి శాంతినగర్ హైస్కూల్ ముస్తాబు...

శతాబ్ది వైభవానికి శాంతినగర్ హైస్కూల్ ముస్తాబు...

శతాబ్ది వైభవానికి శాంతినగర్ హైస్కూల్ ముస్తాబు…

వందేళ్ల విద్యా ప్రస్థానానికి ఘనమైన వేడుకలు..

పూర్వ విద్యార్థులు, గురువుల ఆత్మీయ సమ్మేళనానికి సర్వం సిద్దం.

సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం నగరంలోని శాంతినగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (GMPHS/GHS) వందేళ్ల విద్యా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతోంది. 1927లో ప్రారంభమైన ఈ విద్యాలయం 2026 -27 విద్యా సంవత్సరం నాటికి వంద సంవత్సరాల మైలురాయిని చేరుకోవడం విశేషం. ఎన్నో తరాల విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా తీర్చిదిద్దిన ఈ పాఠశాల చరిత్రలో శతాబ్ది వేడుకలు చిరస్మరణీయ ఘట్టంగా నిలవనున్నాయి.ఈ సందర్భంగా ఈ నెల 29వ తేదీ ఆదివారం పాఠశాల ప్రాంగణంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం, గతంలో విద్యాబోధన చేసిన గురువులను సాదరంగా ఆహ్వానించి సత్కరించడం, పాఠశాల వందేళ్ల ప్రస్థానాన్ని స్మరించుకోవడం ఈ వేడుకల ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక, పూర్వ మరియు ప్రస్తుత ఉపాధ్యాయులకు ఘన సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన ప్రముఖులు, పూర్వ విద్యార్థులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను గౌరవ అతిథులుగా ఆహ్వానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.వందేళ్ల విద్యా ప్రస్థానం అంటే కేవలం ఒక పాఠశాల చరిత్ర మాత్రమే కాదు, వేలాది మంది విద్యార్థుల బాల్య జ్ఞాపకాలు, గురువుల త్యాగాలు, క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యా బోధనకు నిలువెత్తు నిదర్శనం. ఒకప్పుడు ఒకే తరగతి గదిలో చదువుకున్న స్నేహితులు, నేడు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వారు మళ్లీ కలుసుకునే అరుదైన అవకాశం ఈ శతాబ్ది వేడుకలు కల్పించనున్నాయి.
ఈ చారిత్రాత్మక వేడుకలను విజయవంతం చేయడానికి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , జిల్లా కలెక్టర్ , జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ , మున్సిపల్ కమిషనర్ జిల్లా విద్యాశాఖ అధికారి , పూర్వ / ప్రస్తుత ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొంటున్నారు అని, శాంతి నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చల్లగాని కృపా బాలానందం, పూర్వ విద్యార్ధి కొప్పుల నరేశ్, కుంచకర్ర నగేశ్, పాస్యం బ్రహ్మారెడ్డి, భోగా గిరి, పుల్లఖండం రామకృష్ణ, రాఘవాచార్యులు, శ్రీగాధ శ్రీనివాస్‌లతో పాటు పలువురు విద్యార్థులు, డీ. నాగభూషణం, రాములు, బొమ్మిసెట్టి శ్రీనివాస్, కే. రాంబాబు, ఏ. ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button