suryapetaTelangana

ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) ఏప్రిల్ 26

మఠంపల్లి మండలంలోని అల్లిపురం గ్రామ శివారులో ఉన్న ఓ రైతు వ్యవసాయ బావి కి 4గురు యువకులు ఈతకు వెళ్లగా అందులో ఒక్కరూ నీట మునిగిపోయాడని స్నేహితుల సమాచారం వివరాలకు వెళితే ఈ యువకులు కోదాడ ఓ ప్రయివేటు కళాశాలలో బి ఫార్మసీ చదువుతున్నారు.

అందులో ఒక్కరూ ఆల్లిపురం గ్రామానికి చెందిన స్నేహితురాలు వివాహ ప్రధాన కార్యక్రమం నిన్న అనగా గురువారం జరిగింది.

అట్టి వేడుకకు ఖమ్మం నకు చెందిన తోటి స్నేహితులు యువకులు ఆ వేడుకలో రాత్రి పాల్గొని మరుచటి ఉదయం అనగా ఈ రోజు స్నేహితురాలు వివాహం ప్రక్క మండలంలో జరుగుటకు కొంత టైం ఉండడంతో ఈ లోపు అల్లిపురం గ్రామానికి చెందిన వారితో ఖమ్మం జిల్లా వైరా నుండి వచ్చిన ముగ్గురు గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావి దగ్గరకు స్నేహితులు ఈత కొడుతుండగా అందులో ఒక్కరూ ఐన అకిరా నందన్ అనే బాబు ఈత రాకపోయినా వారితో అందులో దూకాడని

అటు తరువాత మునిగి పోయాడని స్నేహితులు ఎంత ప్రయత్నం చేసిన అతను కనిపించలేదని వెంటనే గ్రామంలోని వారికి సమాచారం తెలుపగా వెంటనే వారు వచ్చి ఫైర్ పోలీసులకు సమాచారం తెలుపగా వారు స్థానిక ఈత గాల్లతో మరియు చేపల వలలతో బందువులు వెతికించిన ఫలితం లేదని ఆ బావి చాలా లోతుగా ఉంటుందని సమాచారం స్థానిక పోలీసు లకు ఇప్పుడే సమాచారం అందించారని సమాచారం.స్నేహితురాలి పెండ్లికి వచ్చి ఇలా జరగడం తీవ్ర విషాదం నెలకొంది

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button