సుమారు 25 లక్షల విలువగల గంజాయి పట్టివేత.
చెడు వ్యసనాలకు అలవాటైన యువత.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
మే 07,
చెడు వ్యసనాలకు అలవాటైన యువత సులభ మార్గంలో డబ్బులు సంపాదించడానికి గంజాయి రవాణా ని ఎంచుకోవడం జరుగుతుంది.
ఈ రవాణాలో పోలీసులకు పట్టుబడి తమ అమూల్యమైన జీవితాన్ని కటకటాల పాలు చేసుకుంటున్నారు. భద్రాచలంలోని పోలీస్ మరియు ఎక్సైజ్ అధికారులు కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థ ను ఏర్పాటు చేయడంతో వీరి ఆటలు సాగడం లేదు.
పోలీసుల కన్నుగప్పి కార్లలో బస్సులలో గంజాయిని తరలించడం జరుగుతుంది. అయితే భద్రాచలం ఎక్సైజ్ అధికారులు పెట్రోలింగ్ ముమ్మరం చేసి ఎలాగైనా గంజాయి రవాణా అరికట్టాలని ఉద్దేశంతో అక్రమార్కుల పై ఉక్కు పాదం మోపుతున్నారు. పోలీసుల కన్ను గప్పి హైదరాబాద్కు గంజాయి అక్రమంగా తరలించాలనుకున్నయి అగ్ర మార్కుల ఆటలు సాగడం లేదు.
ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాన్ గిరి నుండి హైదరాబాద్ తరలించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్న ఖమ్మం జిల్లా సింగరేణి మండలం భాగ్యనగర్ తండాకు చెందిన గుగులోత్ నందరాజు అనే యువకుడు ఈ గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాదులోని విపుల శర్మ అనే వ్యక్తికి అందజేయడానికి బయలుదేరాడు అయితే ఎక్సైజ్ అధికారుల నిఘా నుంచి తప్పించు కోలేకపోయాడు.
కారులో గంజాయి తరలిస్తున్న సమాచారం అందుకున్న భద్రాచలం ఎక్సైజ్ సీఐ రహీంనీ స బేగం తన సిబ్బందితో కలిసి నందరాజు ను అదుపులోకి తీసుకున్నారు. నందరాజు నుంచి రెండు సెల్ ఫోన్లు కారును గంజాయిని స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు
పట్టుకున్న గంజాయి విలువ సుమారు 25 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇకనైనా అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి గంజాయిని తరలించాలని చూస్తున్న వారిని ఎవరిని విడిచిపెట్టే సమస్య లేదని ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులు తెలిపారు