KhammamPoliticalTelangana

కాంగ్రెస్ పార్టీలో చేరిన 40 కుటుంబాలు...

కాంగ్రెస్ పార్టీలో చేరిన 40 కుటుంబాలు...

*40 కుటుంబాలను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు లేళ్ళ వెంకట రెడ్డి

హస్తం గుర్తుకు ఓటేసి రామ సాయం రఘురాం రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన – లేళ్ళ వెంకట రెడ్డి *

సీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గ బాదావత్ హాథిరాం నాయక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల పరిధిలోని కొత్తూరు గ్రామపంచాయతీ, పెద్ద హరిజనవాడ గ్రామం నందు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ అధ్యక్షతన నల్లపాటి రామారావు ఆధ్వర్యంలో 40 కుటుంబాలను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన *జిల్లా కాంగ్రెస్ నాయకులు, సొసైటీ చైర్మన్ శ్రీ లేళ్ళ వెంకటరెడ్డి

ఈ సందర్భంగా లేళ్ళ వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ మే 13 న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ రామ సాయం రఘురాం రెడ్డి గారి హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ.. రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేయాలంటే ఇక్కడ మనందరం కలిసికట్టుగా మన అమూల్యమైన ఓటును హస్తం గుర్తుకు వేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షులు నున్నా కృష్ణయ్య, టిపిసిసి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ రాథోడ్, జిల్లా సేవాదళ్ ప్రధాన కార్యదర్శి కోదుమూరి కోటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు ధర్మరాజుల వెంకటనారాయణ, కొమ్ము రవి, సాయిన్ని సీనయ్య, కొమ్ము కృష్ణ, నాగయ్య, నాగేంద్రబాబు మరియు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button