Telangana

మహిళలను కోటీశ్వరులు చేయ‌డమే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

మహిళా ఉన్నతితోనే తెలంగాణ ప్రగతి

  • జిల్లా DRDO అధికారులకు మంత్రి సీత‌క్క దిశానిర్దేశం
  • మహిళా శక్తి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళికపై స‌మీక్ష‌
  • ప్రజా పాలనలో మహిళా సాధికారతకు పెద్దపీట
  • మహిళలను కోటీశ్వరులు చేయ‌డమే ప్ర‌భుత్వ ల‌క్ష్యం
  • గ్రామీణ మ‌హిళ‌లు పారిశ్రామికవేత్త‌లుగా ఎద‌గాలి

మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు మహిళా శక్తి కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మ‌రియు మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. మహిళా ఉన్నతితోనే తెలంగాణ ప్రగతి సాధ్యపడుతుందన్నారు.

రాజేంద్రనగర్, తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ లో జిల్లా DRDO, అదనపు DRDOతో మహిళా శక్తి రాష్ట్ర స్థాయి కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళికపై పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ Prl. Secy సందీప్ కుమార్ సుల్తానియా, తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ సీఈఓ కాత్యాయ‌నితో మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులకు మంత్రి సీతక్క దిశా నిర్దేశం చేశారు. ప్రజా పాలనలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామన్నారు.

డిమాండ్ ఉన్న వ్యాపారాల్లో మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నామని, క్షేత్రస్థాయి వాస్తవాలకు, ప్రజల అవసరాలు, వనరుల లభ్యతకు తగ్గట్టుగా బిజినెస్ మోడల్ ఉండాలన్నారు.

ఆధార్ కేంద్రాలు, మీ సేవ సెంటర్లు, పౌల్ట్రీ, డెయిరీ వ్యాపారాలు, క్యాంటీన్లు, స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసేలా మహిళా సంఘాలకు రుణ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కొత్తగా ప్రారంభించబోయే మహిళా శక్తి క్యాంటీన్లలో రుచి, శుభ్రత బాగా వుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button