రేపు ఎంపీపీ శ్రీనివాస్ నాయక్ కు ఘన సన్మానం..
సికె న్యూస్ ప్రతినిధి :
కూసుమంచి ఎంపీపీగా ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీపీ భానోత్ శ్రీనివాస్ నాయక్ కు మండల పరిషత్ కార్యాలయంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
తన నాయకత్వం లో అందరూ మంచిగా తమ విధులు నిర్వహించామని కూసుమంచి మండల నాయకులు, అధికారులు,ప్రజలు అభినందిస్తున్నారు.
కావున ఈ సన్మాన కార్యక్రమానికి మండలంలోని ఎంపీటీసీ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, అభిమానులు,ప్రజలు అధిక మొత్తంలో పాల్గొని ఈ సన్మాన సభను విజయవంతం చేయగలరని కోరారు.