HyderabadPoliticalTelangana

ఆ పదం నీ నోటికెలా వచ్చింది.. కేటీఆర్‌పై సీతక్క ఫైర్

ఆ పదం నీ నోటికెలా వచ్చింది.. కేటీఆర్‌పై సీతక్క ఫైర్

ఆ పదం నీ నోటికెలా వచ్చింది.. కేటీఆర్‌పై సీతక్క ఫైర్

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు.

కేటీఆర్‌కు ఆడవాళ్లు అంటే గౌరవం లేదని.. అందుకే ఆడవాళ్లను అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డ్యాన్స్‌లు అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళలు కుటుంబాలకు కుటుంబాలు వచ్చి బ్రేక్ డ్యాన్స్‌లు చేసుకోమని కేటీఆర్ మాట్లాడుతున్నాడని.. ఇదేనా మహిళల పట్ల ఆయనకు ఉన్న గౌరవం అని ప్రశ్నించారు.

గత పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో పబ్‌లు, క్లబ్‌లు, బ్రేక్ డ్యాన్స్‌లను ఎంకరేజ్ చేసిన చరిత్ర వారిదని విమర్శించారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మహిళలకు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తుందని చెప్పారు.

కేటీఆర్ ఏమన్నారంటే..
కేటీఆర్ ఈరోజు మాట్లాడుతూ.. మహిళలతోపాటు అన్నివర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.

మహిళ ఉచిత ప్రయాణం గురించి ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ”బస్సుల్లో అల్లం వెల్లుల్లి ఎరితే తప్ప, కుట్లు అల్లికలు చేస్తే తప్ప అని సీతక్క అంటుంది.. అది తప్పని మేమెందుకు అంటున్నాం.. దాని కోసమే బస్సు పెట్టారని మాకు తెలియక ఇన్ని రోజులు మాములుగా నడిపినం.

బస్సుల్లో తన్నుకుంటున్నారని, మంచిగా లేదని ఎక్కువ బస్సులు పెట్టాలని చెప్పాం. మనిషికో బస్సు పెట్టండి.. మేమెందుకు వద్దంటాం. కుటుంబానికి కుటుంబం కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డ్యాన్స్‌లు, రికార్డింగ్ డ్యాన్స్‌లు.. ఏం చేస్తే అది చేయండి మేమెందుకు వద్దంటాం.

కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా బస్సుల్లో సీట్ల కోసం కొట్లాడుకునే పరిస్థితి ఉందా?. సీట్ల కోసం కొట్టుకోవడం, శిఖలు పట్టుకోవడం.. ఇలా కొత్త కొత్తవి చూస్తున్నాం. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌లు, కండెక్టర్లు కూడా నెత్తి పట్టుకునే పరిస్థితి వచ్చింది” అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్..
అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీతక్క ఘాటుగా స్పందించారు. మహిళలు బస్సులో బ్రేక్ డ్యాన్స్‌లు చేసుకోవచ్చు అనే పదం కేటీఆర్ నోటికెలా వచ్చిందని ప్రశ్నించారు.

కేటీఆర్‌, బీఆర్ఎస్ పార్టీ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ” మేము ఏ పథకం చేపట్టిన మీకు నచ్చడం లేదు.. మా పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి.

ఉచిత బస్సు మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌కు ఉచిత బస్సు పెట్టాలనే ఆలోచన రాలేదు.. ఇప్పుడు మేం ఉచిత బస్సు అమలు చేస్తుంటే రకరకాల మార్ఫింగ్ వీడియోలు చేస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.

మహిళలు కుటుంబాలకు కుటుంబాలు వచ్చి బ్రేక్ డ్యాన్స్‌లు చేసుకోమని కేటీఆర్ మాట్లాడుతున్నాడు.. ఇదేనా మహిళల పట్ల నీ సంస్కారం, మీ తండ్రి నీకు నేర్పిన గౌరవం?. మీ ఇంట్లో కూడా ఆడబిడ్డ ఉందిగా.. మీ ఇంటి ఆడబిడ్డలు బస్సులు ఎక్కినప్పుడు బ్రేక్ డ్యాన్స్‌లే చేస్తున్నారా?. కేటీఆర్ ఇలాంటి మాటలు తగవు.. వెంటనే బేషరుతుగా తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి.

గత పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో పబ్‌లు, క్లబ్‌లు, బ్రేక్ డ్యాన్స్‌లను ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. మేము, కాంగ్రెస్ పార్టీ మహిళలను గౌరవించే వ్యక్తులం” అని సీతక్క అన్నారు.

ప్రయాణ సమయంలో సీటు దొరిక్కినప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా మహిళలు ఏదో ఒక పని చేసుకుంటే తప్పేంటని సీతక్క ప్రశ్నించారు.

దాని గురించి బ్రేక్ డ్యాన్స్‌లతో ఆడవాళ్లను పోల్చడమేమిటని మండిపడ్డారు. కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న మాటలపై తెలంగాణ మహిళలు ఆలోచన చేయాలని కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!