HyderabadPoliticalTelangana

తెలంగాణలో పలువురు డీఎస్పీల బదిలీలు

తెలంగాణలో పలువురు డీఎస్పీల బదిలీలు

తెలంగాణలో పలువురు డీఎస్పీల బదిలీలు

తెలంగాణలో పలువురు డీఎస్పీ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ఇవాళ (గురువారం) ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న అధికారి ఎస్ఆర్ దామోదర్ రెడ్డిని అంబర్‌పేట్ డీఎస్పీ, పీటీసీగా బదిలీ చేశారు.

ప్రస్తుతం జగిత్యాల డీఎస్పీ, డీసీఆర్‌బీగా ఉన్న జీ మహేశ్ బాబుని కరీంనగర్ డీఎస్పీ, పీటీసీగా బదిలీ చేశారు. ఇక కరీంనగర్ డీఎస్పీ, పీటీసీగా ఉన్న బీ.రామానుజంను కాగజ్‌నగర్ ఎస్‌డీపీవోగా ట్రాన్స్‌ఫర్ చేశారు. కాగజ్‌నగర్ ఎస్‌డీపీవోగా ఉన్న ఏ.కరుణాకర్‌ను అసిఫాబాద్ ఎస్‌డీపీవోగా బదిలీ చేశారు.

అసిఫాబాద్ ఎస్‌డీపీవోగా ఉన్న పీ.సదయ్యను బదిలీపై హైదరాబాద్‌లోని చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని డీజీపీ కోరారు. ప్రస్తుతం వనపర్తి డీఎస్పీ, డీసీఆర్‌బీగా ఉన్న కే.క్రిష్ణ కిశోర్‌ను తొర్రూర్ (మహబుబాబాద్) ఎస్‌డీపీవోగా బదిలీ చేశారు. ఇక తొర్రూర్ ఎస్‌డీపీవోగా ఉన్న వీ సురేశ్‌ను హైదరాబాద్‌లోని చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

నిర్మల్ డీఎస్పీ, డీసీఆర్‌బీగా ఉన్న పీ.రవీందర్ రెడ్డిని ఖమ్మం ఏసీపీ, సీసీఆర్‌బీగా బదిలీ చేశారు. ఖమ్మం ఏసీపీ, సీసీఆర్‌బీగా ఉన్న డీ.ప్రసన్న కుమార్‌ను మెదక్ ఎస్‌డీపీవోగా ట్రాన్స్‌పర్ చేశారు.

ఈ మేరకు సంబంధిత అధికారులకు డీజీపీ ఉత్వర్వులు జారీ చేశారు. కొత్త పోస్టింగ్ ప్రదేశాల్లో తక్షణమే రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button