HyderabadPoliticalTelangana

పని ఒత్తిడి తట్టుకోలేక చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య..

పని ఒత్తిడి తట్టుకోలేక చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య..

పని ఒత్తిడి తట్టుకోలేక చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం(జూన్18) హీలియం గ్యాస్ పీల్చుకొని సూసైడ్ చేసుకున్న ఘటన గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లో సురేశ్ రెడ్డి (28) అనే యువకుడు ఓ కంపెనీలో సీఏగా పనిచేస్తున్నాడు. అతని సోదరుడితో కలిసి మణికొండలో ఉంటున్నాడు.

అయితే జూన్ 16న సురేశ్ రెడ్డి తన సోదరి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొండాపూర్లోని రాజరాజేశ్వరీ కాలనీలో ఉన్న సర్వీస్ అపార్ట్మెంట్లో అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

చివరికి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

అయితే సురేశ్ గదిలో హీలియం గ్యాస్ సిలిండర్తో పాటు సూసైట్ నోట్ కూడా లభ్యమయ్యింది. తాను పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని అతడు సూసైడ్ నోట్లో రాశాడు.

ఇక మృతుడి స్వస్థలం కామారెడ్డి జిల్లా పాల్వంచగా గుర్తించారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button