మాజీ ఎమ్మెల్యేకు ప్రమాదం.. తలకు తీవ్ర గాయం..

మాజీ ఎమ్మెల్యేకు ప్రమాదం.. తలకు తీవ్ర గాయం..;

By :  Ck News Tv
Update: 2025-03-15 06:23 GMT
మాజీ ఎమ్మెల్యేకు ప్రమాదం.. తలకు తీవ్ర గాయం..
  • whatsapp icon

మాజీ ఎమ్మెల్యేకు ప్రమాదం.. తలకు తీవ్ర గాయం..

హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు!

పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కాసు మహేశ్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి తన ఇంట్లో శుక్రవారం బాత్రూమ్‌లో జారిపడ్డారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.

దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానికంగా ఉన్న మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించారు. దీంతో వైద్యులు కాసు మహేశ్ రెడ్డికి చికిత్స చేశారు.

తలకు తగిలిన గాయానికి 8కుట్లు వేశారు. రెండు రోజులుపాటు విశ్రాంతి తీసుకోవాలని ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు.. నియోజకవర్గ ప్రజలకు..అభిమానులు ఆస్పత్రికి రావద్దు అని సూచించారు.

అలాగే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి అందుబాటులోకి ఉండరు అని స్పష్టం చేశారు.

ప్రస్తుతం కాసు మహేశ్ రెడ్డి కోలుకున్నారని.... ఎవరూ ఆందోళన చెందవద్దు అని కుటుంబ సభ్యులు తెలియజేశారు.

Similar News