విద్యార్ధులు చదవట్లేదని గుంజీలు తీసిన హెడ్మాస్టర్
విద్యార్ధులు చదవట్లేదని గుంజీలు తీసిన హెడ్మాస్టర్;
విద్యార్ధులు చదవట్లేదని గుంజీలు తీసిన హెడ్మాస్టర్
విజయనగరం జిల్లాలో బొబ్బిలి మండలంలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఓ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువులో వెనకబడుతున్నారని ఓ టీచర్ ఆవేదనకు గురయ్యాడు.కానీ వారు, వారి తల్లితండ్రుల నుంచి ఆయనకు ఆశించిన సహకారం అందలేదు.
దీంతో అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైన సదరు హెడ్మాస్టర్ తనకు తానే శిక్ష విధించుకున్నారు.
ఆ హెడ్మాస్టర్ పేరు చింతా రమణ.విద్యార్థులను వారి తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదని విజయనగరం జిల్లా బొబ్బిలిలోని పెంట జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింతా రమణ గుంజీలు తీసి వారికి దండం పెట్టారు.
జిల్లాలోని బొబ్బిలి మండలం పెంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి చెందిన విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని హెడ్మాస్టర్ రమణ ఆవేదన వ్యక్తంచేశారు. ఇవాళ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులను హాజరుపర్చి, వారి ఎదురుగా వున్న స్టేజిపై నుండి మాట్లాడారు.
మీరంతా చదువులో వెనుకబడ్డారని 'మేము మిమ్మల్ని కొట్టలేము, తిట్టలేమ, ఏమీ చేయలేము, మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటూ రమణ ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం విద్యార్థుల ముందు సాష్టాంగ నమస్కారం చేశారు.
అంతటితో ఆగకుండా గుంజీలు కూడా తీయడం మొదలుపెట్టారు. హెడ్మాస్టర్ చర్యతో మొదట అవాక్కయిన విద్యార్థులు వద్దు సార్..గుంజీలు తీయవద్దంటూ వేడుకున్నారు.అయినా ఆయన మాత్రం ఆగలేదు.
అయితే ఇలా హెడ్మాస్టర్ విద్యార్ధుల చదువులపై ఇంత పట్టుబట్టడానికి కారణం విద్యాశాఖ 100 శాతం ఫలితాలు సాధించాలంటూ పెంచుతున్న ఒత్తిడే అన్న విమర్శలు వచ్చాయి. దీంతో మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందించారు.
విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ చింత రమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంతమాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదని....విద్యార్థులను దండించకుండా, గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిందన్నారు.