సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం
తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Film Industry)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్ కల్పన(Singer Kalpana) ఆత్మహత్యాయత్నానికి(Suicide Attempt) పాల్పడ్డారు.
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని నిజాంపేట్‌లో నివాసం ఉంటున్న ఆమె.. మంగళవారం మధ్యాహ్నం ఏమైందో తెలియదు.. కానీ నిద్ర మాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్ చేశారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై దగ్గరలోని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, కల్పన తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో అనేక పాటలు పాడారు. ఇటీవల పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపైనా మాట్లాడారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌ను ఒంటరి చేశారంటూ మద్దతిచ్చారు.