కల్లు లో పురుగుల మందు కలిపి మహిళను చంపిన వ్యక్తి

కల్లు లో పురుగుల మందు కలిపి మహిళను చంపిన వ్యక్తి;

By :  Ck News Tv
Update: 2025-02-27 11:23 GMT

కల్లు లో పురుగుల మందు కలిపి మహిళను చంపిన వ్యక్తి

రెండు వారాల క్రితం మహిళ మిస్సింగ్​ కేసులో ఆమె దారుణ హత్యకు గురైనట్టు బుధవారం పోలీసులు తేల్చారు. గజ్వేల్​ఏసీపీ కే.పురుషోత్తంరెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 15న సిద్దిపేట జిల్లా వర్గల్​ మండలం అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన ధార యాదమ్మ(40) ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె కుమారుడు దార సాయి కుమార్ గౌరారం పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేశారు. గజ్వేల్ రూరల్​ సీఐ మహేందర్​రెడ్డి, గౌరారం ఎస్సై కరుణాకర్​రెడ్డిలు దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 25వ రాత్రి అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన బండ్ల చిన్న లస్మయ్య అనే వ్యక్తిని విచారించగా యాదమ్మ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. సంవత్సరంన్నర నుంచి దార యాదమ్మతో అతనికి పరిచయము ఏర్పడింది.

ఆపై పెళ్లి చేసుకోమంటోందని ఎలాగైనా అడ్డు తొలిగించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో అతను పథకం ప్రకారం ఈనెల15న మధ్యాహ్నం 2:30 గంటలకు ఆమెను తన మోటార్ సైకిల్ పై గజ్వేల్ మండల పరిధిలోని కోమటిబండ గ్రామం అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ వారి వెంట తెచ్చుకున్న కల్లును ఇద్దరు తాగే సమయంలో ఆమెకి తెలియకుండా ఆమె గ్లాసులో పురుగుల మందు కలిపాడు. దాన్ని యాదమ్మ తాగిన తర్వాత ఆమెను ఆమె మెడకు చీరతో ఉరి వేసి ఊపిరాడకుండా చేసి చంపాడు.

అనంతరం అక్కడ నుంచి గ్రామానికి వెళ్లిపోయాడు. యాదమ్మను గ్రామానికి చెందిన వ్యక్తే హత్య చేశాడని తెలియటంతో న్యాయం చేయాలని బుధవారం మృతురాలి కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద సంఖ్యలో నిందితుడి ఇంటి ముందు బైఠాయించారు. విషయం తెలుసుకున్న గజ్వేల్​ ఏసీపీ పురుషోత్తంరెడ్డి, రూరల్​ సీఐ మహేందర్​రెడ్డిలు వారికి న్యాయం చేస్తామని నచ్చజెప్పి అక్కడ నుంచి పంపించివేశారు.

పోలీసులు విచారణ పూర్తి చేసి సంఘటనా స్థలంలోనే యాదమ్మ మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడిపై హత్య కేసుతో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.Full View

Similar News