నారాయణ కాలేజీ ముందు మహిళల ఆందోళన.

By :  Admin
Update: 2025-02-05 05:07 GMT

*చదివేది ఇంటర్ కానీ వాళ్ళ చేష్టలు పోకిరి చేష్టలు....దుస్తులు లేకుండా ఆంటీ ఆంటీ ..అంటూ వెకిలి చేష్టలు.. నారాయణ కాలేజీ ముందు మహిళల ఆందోళన.*

హైదరాబాద్‌ వనస్థలిపురం సామనగర్‌లో నారాయణ కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు కాలనీ వాసులు. హాస్టల్ విద్యార్థులు కిటికీల దగ్గర కూర్చొని పిచ్చి కూతలు, రోత చేష్టలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇళ్లలోకి పేపర్‌ రాకెట్లు విసిరేస్తున్నారని .. లైజర్‌ లైట్లతో ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు దుస్తులు లేకుండా అసభ్యంగా తిరుగుతున్నట్లు మహిళలు చెబుతున్నారు

హాస్టల్‌ స్టూడెంట్స్‌ ఆగడాల వల్ల ఇంటి నుంచి బయటకు రావాలన్నా.. ఇంట్లో వుండాలన్నా భయం వేస్తుందని వాపోయారు మహిళలు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కాలేజీ మేనేజ్‌మెంట్‌ నుంచి కనీస స్పందన రాలేదన్నారు.

గొడవ విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. స్థానికులతో, కాలేజీ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడారు. ఇక్కడి నుంచి కాలేజీ హాస్టల్‌ను షిప్ట్‌ చేయాల్సిందేనని పోలీసులకు తేల్చి చెప్పారు మహిళలు. లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు.

Similar News