తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. 31.21 శాతం ఉత్తీర్ణత.. చెక్ చేసుకోండిలా

By :  Admin
Update: 2025-02-05 13:35 GMT

తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. 31.21 శాతం ఉత్తీర్ణత.. చెక్ చేసుకోండిలా..

తెలంగాణ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ విద్యాశాఖ 2025 జనవరి 2 నుంచి 20 వరకు ఆన్ లైన్ విధానంలో ఈ పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలకు మొత్తం 1,35,802 మంది హాజరయ్యారు.

ఈ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి యోగిత విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం 31.21 శాతం మంది అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. మొత్తం 42,384 మంది టెట్ లో అర్హత సాధించారు. మీ ఫలితాలను https://tgtet2024.aptonline.in/tgtet/ వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

టెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి విడుదల కాబోయే డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం సంవత్సరంలో రెండు దఫాలుగా టెట్ పరీక్షలను నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. జాబ్ క్యాలెండర్ ప్రకారం.. ఫిబ్రవరి నెలలో 6000 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ.. ఎస్సీ వర్గీకరణ అంశం కారణంగా నోటిఫికేషన్లకు బ్రేక్ పడింది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

Tags:    

Similar News