ఉస్మానియా మెడికల్ కాలేజీ కి నోటీసులు ఇచ్చిన యూజీసీ

ఉస్మానియా మెడికల్ కాలేజీ కి నోటీసులు ఇచ్చిన యూజీసీ;

By :  Admin
Update: 2025-02-07 03:59 GMT

ఉస్మానియా మెడికల్ కాలేజీ కి నోటీసులు ఇచ్చిన యూజీసీ

యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్..యూజీసీ తన అండర్ లో ఉన్న కాలేజీలకు ర్యాగింగ్ విషయంలో నింబధలను సెట్ చేసింది. ఇవి తప్పనిసరిగా అన్ని కాలేజీల్లో పాటించాల్సిందే.

ర్యాగింగ్ భూతాన్ని అరికట్టేందుకు వీటిన స్ట్రిక్ట్ అమలు పరచాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. యాంటీ ర్యాగింగ్ రెగ్యులేషన్స్- 2009 చట్టంగా దీన్ని తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ నిబంధనలు కొన్ని కాలేజీలు సరిగ్గా పాటించడం లేదంటూ యూజీసీ నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ నుంచి మూడు, ఆంధ్రా నుంచి ఒకటి..

ర్యాగింగ్ నిరోధక చర్యలు పాటించని 18 వైద్య కళాశాలలకు తాజాగా యూజీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న 18 కాలేజీల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ, గుంటూరు మెడికల్ కాలేజీ, కర్నూలు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అలాగే తెలంగాణ నుంచి హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ కూడ ఈ లిస్ట్ లో ఉంది. ఇవి కాకుండా బీహార్ నుంచి మూడు మెడికల్ కాలేజీలు, ఢిల్లీ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి రెండు మెడికల్ కాలేజీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ప్రదేశ్ నుంచి ఒక్కో కాలేజీ ఉన్నాయి.

మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ర్యాగింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని అరికట్టేందుకు యూజీసీ 2009లో చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం సూచించిన అంశాలను తప్పనిసరిగా అన్ని కాలేజీల్లో పాటించాల్సి ఉంటుంది.

Similar News