ఏపీఎంపై మహిళలు ఫిర్యాదు చేస్తే బకాయిలను అవనీతిగా చూపుతారా?
ఏపీఎంపై మహిళలు ఫిర్యాదు చేస్తే బకాయిలను అవనీతిగా చూపుతారా?;
ఏపీఎంపై మహిళలు ఫిర్యాదు చేస్తే బకాయిలను అవనీతిగా చూపుతారా?
*మధిరలో పనిచేసినప్పుడు ఆయన మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి*.
*స్త్రీ నిధిక ఏపీఎంకు అసలు సంబంధమే లేదు*.
తమతో అసభ్యంగా ప్రవర్తించి, భూతులు తిడుతూ అవమాన పరుస్తున్న ఏపీఎంపై చర్యలు తీసుకోవాలని స్థానిక కల్లూరు ఆర్డీవోకు చేసిన ఫిర్యాదు పై విచారణను తప్పించుకునేందుకు ఏపీఎం బీరవెల్లి రాంబాబు బకాయిలను అవినీతిగా చూపుతున్నారని ఏఐటియుసి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణలు ఆరోపించారు.
కల్లూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఐకెపి ఏపీఎం బీరవెల్లి రాంబాబు విలేకరులకు వివరించినట్లుగా నిధులు గోల్ మాల్ కాదన్నారు. కేవలం రికారీ చేయాల్సిన నిధులు మాత్రమేనన్నారు. అది కూడాను సభ్యులు దగ్గరే ఉండిపోయాయన్నారు.
రికవరీ చేయాల్సిన డబ్బులను గోల్ మాల్ గా చూపెట్టి విలేకరులను, ప్రజలను, అధికారులను స్థానిక శాసన సభ్యురాలనీ సైతం పక్కదారి పట్టించారన్నారు. బ్యాంకు లింకేజీ విషయమై వివోఏపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకురావటమే కాకుండా తమను అసభ్యంగా మాట్లాడుతూ అవమానిస్తున్నారని మాకు తెలిపిన వెంటనే అతనిపై ఆర్డిఓకి ఫిర్యాదు చేశామన్నారు. అతనిపై విచారణకు వస్తుందన్న విషయాన్ని గ్రహించిన ఏపీఎం రాంబాబు పత్రికా ముఖంగా గోల్ మాల్ జరిగినట్టు పేపర్ ప్రకటన చేశారని వారు తెలియజేశారు.
ఇదే విషయంపై వివోఏలు స్థానిక శాసన సభ్యురాలను కలిసి వివరించగా జరిగింది గోల్ మాల్ కాదని, రికవరీ చేయాల్సిన నిధులు మాత్రమేనని స్థానిక శాసన సభ్యురాలు దగ్గర ఆయన ఒప్పుకున్నారని వారు వివరించారు.
మహిళపై అసభ్యంగా మాట్లాడుతున్న బీరవెల్లి రాంబాబుని శాసన సభ్యురాలు కూడా మందలించినట్లు వారు తెలియజేశారు. స్థానికుడైన వాడు ఆ మండలంలో పనిచేయడానికి అవకాశం లేదని కావున పక్క మండలానికి వెళ్లిపోమని ఎమ్మెల్యే సూచించినట్లు కూడా వారు ఈ సందర్భంగా తెలియజేశారు.
*ఏపీఎంపై ఆరోపణలు ఎన్నో*
ఏపీఎం రాంబాబు గురించి మేము ఆరా తీయగా 2015 సంవత్సరంలో రాష్ట్రీయ మహిళా కోష్ (ఆర్ఎంకె) క్రింద విడుదలైన కోటి రూపాయలకు సంబంధించి రికవరీ చేయలేదన్నారు. నేషనల్ క్రెడిట్ ఫండ్ ఫర్ వుమెన్ ( ఎన్ సి ఎఫ్ డబ్ల్యు) నిధులు కింద మంజూరైన మరొక కోటి రూపాయలను ఆయన రికవరీ చేయలేకపోయారని వారు తెలియజేశారు. మధిర మండలంలోని క్లస్టర్లో తన కూతురి వివాహం కోసం ఒక గ్రూపు పేరు మీద పది లక్షల రూపాయల రుణం తీసుకొని అక్కడి గ్రామ సమైక్య ల నుండి తీర్మానం చేసుకొని రుణమాఫీ చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని వాళ్ళు వెల్లడించారు. మధిర మండలంలో స్త్రీ నిధికి సంబంధించి 10 లక్షల రూపాయలను ఒక గ్రూపుకు లోను రూపంలో ఇప్పించి నాన్ పెర్ఫార్మింగ్ ఎకౌంటు ( ఎన్పీఏ) చూపించడానికి కొంత ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నట్లు వారు తెలియజేశారు.. 2017 వ సంవత్సరంలో హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఫండ్ క్రింద ఖమ్మం జిల్లాకి రెండు కోట్ల రూపాయలు విడుదలయ్యాయని ఆ పండు మోనిటరింగ్ మేనేజర్ గా బీరవెల్లి రాంబాబు వివరించినట్లు ఆ సమయంలో లక్షల రూపాయలలో ఫ్రాడ్ జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. 2018 వ సంవత్సరంలో స్త్రీ నిధి, సెర్ఫ్ లను వేరువేరు విభాగాలు చేశారని. 2019 వ సంవత్సరం నుండి స్త్రీ నిధికి ప్రత్యేక ఆర్ఎం తోపాటు, ప్రతి మూడు మండలాలకు కలిపి ఒక మేనేజర్ ఉంటారని కావున స్త్రీ నిధికి, ఏపీఎంకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన సొంత మండలం కావటం కారణంగా కొంతమంది రాజకీయ నాయకుల అండతో అత్యుత్సాహాన్ని ప్రదర్శించే బీరవెల్లి రాంబాబు నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ, అసభ్యంగా మాట్లాడుతూ అవమానిస్తున్నారు. బీరవెల్లి రాంబాబు పై తమకు ఎటువంటి వ్యక్తిగత కక్ష లేదన్నారు. మంచి మాటలతో పని చేయించుకోవాలి తప్ప పౌరుష పదజాలాన్ని ఉపయోగించి అవమానపరిచేలా చేయకూడదన్నారు. వివోఏ లను అనేక ఇబ్బందులకి గురిచేస్తున్న ఏపీఎం బీరవెల్లి రాంబాబుని కల్లూరి మండలం నుండి బదిలీ చేయాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఇప్పటికైనా బీరవెల్లి రాంబాబు తమ తీరును మార్చుకోవాలని లేనియెడల భౌతిక దాడులకైనా వెనకాడ బోమని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో *సిపిఐ కల్లూరు మండల కార్యదర్శి దామాల దయాకర్, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు డివిజన్ కార్యదర్శి షేక్ రంజాన్ భీ, తెలంగాణ రాష్ట్ర వి ఓల సంఘం (ఏఐటియుసి) జిల్లా కన్వీనర్ నాగమణి, జిల్లా నాయకురాలు జొన్నలగడ్డ కుమారి* తదితరులు పాల్గొన్నారు.