సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు.....
ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్.సి.డి. క్లినిక్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్*;
సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు.
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
రోగులకు స్వాంతన కలిగించేలా వైద్యులు సేవలు అందించాలి
ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్.సి.డి. క్లినిక్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్*
సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం, ఫిబ్రవరి -06:
సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు అని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
గురువారం జిల్లా ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఎన్.సి.డి. విభాగాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, ప్రభుత్వ హాస్పిటల్ నందు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమం క్రింద జిల్లా ఆసుపత్రిలో ఎన్.సి.డి. క్లినిక్ విభాగం ఏర్పాటు చేసి రక్తపోటు, వృద్ధాప్య సేవలు, మానసిక సమస్యలు, కిడ్నీ, కాలేయ సమస్యలు, నోటి సమస్యలు, క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాత నివారణకు పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు.
ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన ఎన్.సి.డి. క్లినిక్ ద్వారా గర్భాశయ ముఖ ద్వారం క్యాన్సర్ (సర్వికల్ క్యాన్సర్), రొమ్ము, నోటి క్యాన్సర్, మధుమేహం, పక్షవాతం, గుండెపోటుకు ఎటువంటి చికిత్స తీసుకోవాలి, వ్యాధి గుర్తింపు వంటి అంశాలపై దృష్టి సారించి పని చేస్తుందని అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలోని డయాగ్నస్టిక్ వార్డు, ఫిజియోథెరపీ, మందులు అందించే గది, క్షయ వ్యాధి నిర్మూలన కేంద్రం, ఇన్ పేషెంట్ వార్డు, గర్భిణీ స్త్రీల వార్డ్, మందులు నిల్వ చేసే స్టోర్ రూమ్ లను పరిశీలించారు. ఇన్ పేషెంట్ లో ఉన్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఔట్ పేషెంట్ వివరాలు, సిబ్బంది వివరాలు, మందులు, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్య సేవలు అందించాలని, మందుల నిల్వలు సరిపడ ఉండే విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిలో రోగులకు పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వాలన్నారు. ఆసుపత్రిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ ఆసుపత్రి మొత్తం తిరిగి భవనాలను పరిశీలించారు. కావాలసిన వసతి ఏర్పాట్లపై పార్కింగ్, టాయిలెట్స్ నిర్మాణాల కోసం అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. హాస్పిటల్ వద్ద ప్రధాన గెట్ ప్రక్కన పార్కింగ్ స్థలం, సఖి కేంద్రం ప్రక్కన విశాలమైన పార్కింగ్ తో ఇన్, అవుట్ గేట్లతో నిర్మాణాలకు అధికారులకు కలెక్టర్ మ్యాపింగ్ చూపెట్టారు.
అనంతరం హస్పిటల్ ప్రాగంణంలో సఖి కేంద్రంను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించారు. కోర్టు కేసుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారిణి డా. బి. కళావతి బాయి, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కిరణ్ కుమార్, ఆర్ఎంఓ రాంబాబు, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.