తెలంగాణలో సాగు ప్రోత్సాహకానికి కేంద్రం చేపడుతున్న చర్యలేంటి..?

* అగ్రిసూర్ నిధుల ద్వారా కొత్త స్టార్టప్ ల మద్దతు లక్ష్యాలేంటి..?;

By :  Admin
Update: 2025-02-06 10:35 GMT

తెలంగాణలో సాగు ప్రోత్సాహకానికి కేంద్రం చేపడుతున్న చర్యలేంటి..?

* అగ్రిసూర్ నిధుల ద్వారా కొత్త స్టార్టప్ ల మద్దతు లక్ష్యాలేంటి..?

* లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి

ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు అత్యధికంగా ఉన్నాయని.. ఇక్కడ సుస్థిర వ్యవసాయ ప్రోత్సాహకానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోంది..? అని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. అగ్రిసూర్ నిధుల ద్వారా అగ్రి స్టార్టప్ లు, గ్రామీణ సంస్థల మద్దతుకు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకున్నారని అడిగారు. దీనికి కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

* అగ్రిసూర్ ఫండ్ ద్వారా కచ్చితంగా సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ అగ్రి ఫ్యూర్ వంటి సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

* అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, పశు పోషణ, మత్స్య పరిశ్రమ, వ్యవసాయ యాంత్రీకరణ కు అగ్రి స్టార్టప్ లు ఎంతో సహకరిస్తున్నాయని కేంద్ర మంత్రి చెప్పారు.

* గ్రామీణ ప్రాంతాల్లో.. సాగు ఆధారిత ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంపొందిస్తున్నట్లు చెప్పారు. సహకార, రైతు ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా వ్యవసాయంలో అధునాతన పద్ధతులకు శ్రీకారం చుడుతున్నామన్నారు.

* వ్యవసాయ స్టార్టప్ లకు సంబంధించి.. దేశవ్యాప్తంగా ఒకే విధానం అవలంబిస్తున్నామని ఈ సందర్భంగా.. కేంద్రమంత్రి వివరించారు.

Similar News