అక్రమ ఇసుక రవాణాపై తహశీల్దార్ ప్రత్యేక నిఘా
అక్రమ ఇసుక రవాణాపై తహశీల్దార్ ప్రత్యేక నిఘా;

అక్రమ ఇసుక రవాణాపై తహశీల్దార్ ప్రత్యేక నిఘా
అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టిన తహసీల్దార్ ఆ మాఫియాకు బిగ్ షాకిచ్చాడు. ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకుని తానే స్వయంగా డ్రైవ్ చేస్తూ కార్యాలయానికి తరలించారు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల ఆకేరు వాగు పరివాహక ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు.
ఇసుక అక్రమ రవాణా చేస్తున్న మాఫియా తహసిల్దార్ కార్యాలయ సిబ్బందికే సవాల్ విసిరుతున్నారు. ఇసుక బకాసురులపై నిఘా పెట్టిన తహసీల్దార్ ఆకేరు వాగు వద్దకు వెళ్లారు.
ఈ సమయంలో రెవెన్యూ సిబ్బంది వస్తున్నారనే సమాచారం అందుకున్న ఇసుక బకాసురులు ట్రాక్టర్ ను ఆకేరు వాగుమధ్యలో వదిలేసి వెళ్లారు. వాగు రెండువైపులా ప్రవాహం ఉన్నా చోటికి అధికారులు రాలేరని భావించి అక్కడ ట్రాక్టర్ ను వదిలిపెట్టారు. ఇది గ్రహించిన తహసీల్దార్ తానే వాగులోకి వచ్చాడు.
వారి సవాల్ ని స్వీకరించి తానే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ అందరికీ షాక్ ఇస్తూ ఇసుక ట్రాక్టర్ని తమ కార్యాలయానికి డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లాడు తహసిల్దారు K. రాజు. అక్కడే ఉన్నవారు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ గా మారింది.