కానిస్టేబుల్ బలవన్మరణం....
నేలకొండపల్లి: మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న బండి కృష్ణ(39) అనే వ్యక్తి నగరంలోని శ్రీనివాస నగర్ ముత్యాలమ్మ తల్లి గుడి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద గూడ్సు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.
కానిస్టేబుల్ కృష్ణ స్వగ్రామం వైరా మండలం రెబ్బవరం కాగా కొన్నేళ్ల క్రితం ఖమ్మం ముస్తఫా నగర్ లో సొంత ఇంట్లో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన కృష్ణ ఇంటికి తిరిగి రాలేదు.కుటుంబ సభ్యులు వెతుకుతుండగా జీఆర్పీ పోలీసులు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఈయన 2009లో కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరారు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు.ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరణించిన కానిస్టేబుల్ కు పోలీసుల నివాళులు..
నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బండి క్రిష్ణా మరణవార్త తెలుసుకున్న నేలకొండపల్లి ఎస్సై సంతోష్, తోటి పోలీసు సిబ్బంది, పోలీస్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వేంకటేశ్వర్లు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మృతిని స్వగ్రామమైన వైరా మండలం రెబ్బవరం లో అంత్యక్రియలు నిర్వహించారు.