జోరుగా గుట్కా వ్యాపారం.!
భువనగిరి గడ్డ.. గుట్కా కు అడ్డ.;
జోరుగా గుట్కా వ్యాపారం.!
భువనగిరి గడ్డ.. గుట్కా కు అడ్డ.
యేదేచ్ఛగా విక్రయాలు
నిషేధం ఉత్తి మాటేనా....
అధికారుల కే సవాలు విసురుతున్న గుట్కా రాయుళ్లు.
అధికారులు కిరాణా షాపులను ఆకస్మికంగా తనిఖీ చేయాలని ప్రజల విజ్ఞప్తి.
పెడదారి పడుతున్న యువత
సికే న్యూస్ వలిగొండ.
సి కె న్యూస్ వలిగొండ మండలం ప్రతినిధి బాలరాజు మార్చి 5.
భువనగిరి నియోజకవర్గం లో పలు మండలాలలో గుట్కా దందా జోరుగా సాగుతుంది. ఓవైపు మత్తు పదార్థాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతున్న, నియోజకవర్గంలో మాత్రం విచ్చలవిడిగా గుట్కా వ్యాపారం సాగుతుంది. ఈ వ్యాపార వెనక కొందరు పడా బాబుల పాత్ర ఉన్నట్లు తెలుస్తుంది. కర్ణాటక రాష్ట్రం నుండి హైదరాబాదుకు, అక్కడనుండి నియోజకవర్గంలోని మండల కేంద్రాలకు తరలించి స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసుకొని, తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకొని, గుర్తు సప్పుడు కాకుండా తెల్లవారుజామున, అర్ధరాత్రి వేళలలో పాన్ షాప్లకు తరలించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు.
అంబర్, కైని, పొగాకు ఉత్పత్తులు,ఇతర మత్తు పదార్థాల అమ్మకాలు జోరుగా
కొనసాగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా లభిస్తున్నాయి.చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంబర్, గుట్కాల కు ఇతర, మత్తు
పదార్థాలకు అలవాటు పడుతున్నారు. ఈ దందా కొద్దీ సంవత్సరాలుగా సాగుతుందని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. వీటికి బానిసలై యువత
అనారోగ్యం భారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. నిషేధిత అక్రమ వ్యాపారం మాత్రం ఆగడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
మరోవైపు గుట్కా దందాను నడిపిస్తున్న వ్యాపారులు ఏజెంట్లతో గ్రామాల్లోని కిరాణా షాపులకు సరఫరా చేస్తున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. అదే విధంగా నిషేధిత సరుకు కు కాపలాగా
మనుషులను ఏర్పాటు చేసుకుని వ్యాపారాన్ని విస్తరింపజేసినట్టుగా
తెలుస్తోంది. అనతికాలంలోనే సదర్ వ్యాపారులు ఈ వ్యాపారంతో రూ.కోట్లకు పడగలెత్తినట్టుగా పలువురు
చర్చించుకుంటున్నారు. ఈ అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట పడడం లేదని, పేద ప్రజలు, యువకులు అనారోగ్యం బారిన పడుతున్నారని
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు గుట్కా దందాను కట్టడి చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.