మీడియా ముసుగులో అక్రమ వసూళ్ళు

మీడియా ముసుగులో అక్రమ వసూళ్ళు;

By :  Ck News Tv
Update: 2025-02-11 12:12 GMT

మీడియా ముసుగులో అక్రమ వసూళ్ళు

-- ప్రధాన నిందితుడు అరెస్ట్

-- వివరాలు వెల్లడించిన డిఎస్పి రాజశేఖర్ రాజు

నల్గొండ సీకే న్యూస్ పీబ్రవరి11

ప్రభుత్వ అధికారుల పైన తప్పుడు, అబద్ధపు వార్తలు ప్రచురిస్తూ, అనంతరం వారిని బెదిరింపులకు గురి చేస్తూ, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న “క్రైమ్ మిర్రర్ ఈ-న్యూస్ పేపర్” స్టేట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అయిన నాగుల ఆనంద్ కుమార్ నీ నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.సహ-నేరస్తులయిన, తుప్పరి రఘు మరియు పెరబోయిన ఆంజనేయులు లని ఇదివరకే మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ మాట్లాడారు.క్రైమ్ మిర్రర్ డిజిటల్ పేపర్” కు స్టేట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అయిన నాగుల ఆనంద్ కుమార్ తనకు పరిచయస్తులైన తుప్పరి రఘు మరియు పేరబోయిన ఆంజనేయులు ల సహకారంతో, ఒక ముఠాగా ఏర్పడి, నల్లగొండ జిల్లాలోను, మరియు వికారాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లోనూ, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను, వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకొని, అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో, తప్పుడు మరియు కల్పిత సమాచారంతో క్రైమ్ మిర్రర్ డిజిటల్ పత్రికలో ప్రచురణలు చేసి, అసత్య ప్రచారం చేసి, వారిని బెదిరించి డబ్బులు సంపాదించినారు.ఇటీవలే, సదరు నేరస్తులపైన, వారి ఆగడాల గురించి వచ్చిన ఫిర్యాదు పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు కాగా నల్లగొండ డి.ఎస్.పి. కె శివరాం రెడ్డి, పరిశోధన చేసి, సాక్ష్యాధారాలు సేకరించి, ఈరోజు ప్రధాన నిందితుడు అయిన నాగుల ఆనంద్ కుమార్ ను పట్టుబడి చేసి, అతని వద్ద నుండి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండు కు పంపడం జరిగిందని తెలిపారు. సదరు నేరస్థుడి విచారణలో, మరికొన్ని దురాగతలు వెలుగులోకి వచ్చినాయి. మిగతా ఇద్దరు నేరస్తులను, మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు ను కూడా ఇదే విధంగా వేధించి, భయపెట్టి రెండు లక్షలు డిమాండ్ చేసిన, కేసుకు సంబంధించి, మిర్యాలగూడ టూ టౌన్ లో నమోదు అయిన కేసులో ఇటీవలే అరెస్టు చేసి రిమాండుకు పంపడం జరిగిందని తెలిపారు.

Similar News