కేటీఆర్ పై ఫైర్ అయిన తుమ్మల
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. పదేళ్లు అధికారంలో ఉండి రైతుల పరిస్థితిని దిగజార్చారని.. పదేళ్లు ఏమి చేయకుండా ఇప్పుడు అధికారం పోగానే రైతుల గురించి కేటీఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు రైతుల గురించి మాట్లాడని కేటీఆర్ ఇప్పుడు మాట్లాడటం ఏంటి..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పదేళ్లలో రైతులకు చేయని మంచిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే చేసిందన్నారు. రైతుల కోసం కేసీఆర్ ఎంతో కొంత పని చేస్తే.. ఇప్పుడు కేటీఆర్ ఆ క్రెడిట్ ఆయనకు దక్కకుండా చేస్తున్నారన్నారు.కేసీఆర్‌పై రైతులకు ఉన్న కాస్తో కూస్తో గౌరవాన్ని కేటీఆర్ తీస్తున్నారన్నారు. కేసీఆర్‌కు ఉన్న ఉద్యమ గౌరవాన్ని కేటీఆర్ లేకుండా చేస్తున్నారు. రైతుల ఆత్మహత్యలను ప్రోత్సాహించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ సబ్జెక్ట్‌పై కేటీఆర్ మాట్లాడకపోవడమే బెటర్ అని.. లేదంటే బీఆర్ఎస్ కు మళ్లీ పార్లమెంట్ ఫలితాలే రిపీట్ అవుతాయని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు గెలవని విషయం తెలిసిందే. ఇక, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు అందరికి సాగుకు యోగ్యమైన భూమికి రైతు భరోసా ఇస్తామని తెలిపారు. పదేళ్లలో బీఆర్ఎస్ రైతు బంధు ఎంత ఇచ్చిందనే సోయి లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వ్యవసాయానికి పనికిరాని రాళ్ళు, గుట్టలు లెక్కలు త్వరలోనే బయటకు వస్తాయని.. శాటిలైట్ ఇమేజ్‌తో వ్యవసాయ భూమి లెక్కలు తీసే పని మొదలు అయిందని తెలిపారు.