*ఢిల్లీ సీఎంగా పర్వేశ్ వర్మ?*

డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఘన అందుకుంది;

By :  Ck News Tv
Update: 2025-02-11 07:09 GMT

*ఢిల్లీ సీఎంగా పర్వేశ్ వర్మ?*

*దాదాపుగా పేరు ఖరారైనట్టేనా?*

డిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఘన అందుకుంది. మొత్తం 70 స్థానాలకు గానూ బీజేపీ 50 స్థానాల్లో విజయం సాధించింది. ఆప్ కేవలం 22 సీట్లకు పరిమితమయ్యింది.

దేశ రాజధాని ఢిల్లీలో పదేళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ పాలన కొనసాగింది బీజేపీ చివరకు ఆ పార్టీని ఓడించి విజయాన్ని సాధించింది.నాలుగోసారి విజయం కోసం ప్రయత్నించిన కేజ్రీవాల్ పార్టీకి నిరాశ ఎదురైంది. కాషాయ పార్టీ 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దాదాపు మూడు దశబ్ధల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి రావడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ నూతన సీఎం ఎవరనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది.

పర్వేష్ వర్మ, రమేష్ బిధూరీ, కైలాష్ గహ్లోత్, కపిల్ మిశ్రా, అర్విందర్ సింగ్ లవ్లీ, విజేందర్ గుప్తా వంటి నేతల పేర్లు ముఖ్యమంత్రి రేసులో వినిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఢిల్లీ ముఖ్యమంత్రిగా పర్వేశ్ వర్మ పేరు ఖారారు అయినట్టు తెలుస్తోంది. అమిత్ షా, ప్రధాని మోదీ పర్వేశ్ వర్మ వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. మరోవైపు బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ సైతం పర్వేశ్ వర్మ పేరును సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ నూతన సీఎంగా పర్వేశ్ వర్మ పేరు దాదాపు ఖారారు అయినట్టే చర్చ బీజేపీలో సాగుతోంది. దీనిపై మంగళవారం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇక పర్వేశ్ వర్మ విషయానికి వస్తే..ఆయన పార్టీ సీనియర్ నాయకులలో ఒకరు. పర్వేశ్ వర్మ 1977 నవంబర్ 7న ఢిల్లీలో జన్మించారు. పర్వేశ్ వర్మ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఎం.ఎస్.సి. డిగ్రీ పొందాడు. పర్వేశ్ వర్మ రాజకీయాలలోకి రాకముందు కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశారు. ఆయన తండ్రి సాహిబ్ సింగ్ వర్మ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. పర్వేశ్ వర్మ 2013లో ముండ్కా నియోజకవర్గం నుండి ఢిల్లీ శాసనసభకు ఎన్నికయ్యారు. 2014 లోక్ సభ ఎన్నికలలో పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. పర్వేశ్ వర్మ అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నాడు. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) సభ్యులు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Similar News