మానవత్వం చాటుకున్న సీపీఐ(ఎం) నేతలు
మానవత్వం చాటుకున్న సీపీఐ(ఎం) నేతలు;
మానవత్వం చాటుకున్న సీపీఐ(ఎం) నేతలు
వ్యక్తి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు ఎర్రుపాలెం వెళ్తున్నారు.
రోడ్డుపై తీవ్రంగా గాయపడి ప్రమాదకర పరిస్థితులో ఉండటంతో పోతినేని సుదర్శన్ రావు తన కారుని వెంటనే ఆపి 108 కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి 108 వచ్చేవరకు ఉండి 108 లో ఆ వ్యక్తిని ఎక్కించి ప్రాణాలను కాపాడిన సంఘటన మండల పరిధిలోని రావినూతల - జానకిపురం గ్రామాల మధ్యలో శుక్రవారం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వైరా పట్టణ బీసీ కాలనీకి చెందిన కాశీమల్ల చార్లెస్ ఇటుక బట్టి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వైరా నుంచి తన మోటార్ సైకిల్ పై సూర్యాపేట జిల్లా కోదాడలో ఇటికబట్టి వద్దకు వెళుతున్నాడు. అయితే మండల పరిధిలోని జానకిపురం - రావినూతల మధ్య ప్రమాదవశాత్తు మోటార్ సైకిల్ కి బ్రేకులు పడకపోవడంతో తనకు తానే రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు జిల్లా కార్యదర్శి సభ్యులు బండి రమేష్ మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు ఖమ్మం నుంచి ఎర్రుపాలెం కారులో వెళ్తున్నారు. రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న చార్లెస్ ను చూసి వెంటనే 108 కు సమాచారం అందించారు.
108 వచ్చేవరకు సంఘటన స్థలంలోనే వారు ఉండి అవసరమైన ప్రాథమిక చర్యలను చేపట్టారు. 108 రాగానే స్వయంగా అతనిని పోతినేని సుదర్శన్ రావు, బండి రమేష్, మడిపల్లి గోపాల్ రావు 108 లో ఎక్కించి ప్రాణాల నుంచి కాపాడారు.108 లో చార్లెస్ ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలు పాలై ప్రమాదకర స్థితిలో ఉన్న చార్లెస్ ని సకాలంలో స్పందించి 108 కి సమాచారం అందించడం వల్లనే ప్రాణాల నుంచి బయటపడినట్లు 108 సిబ్బంది తెలిపారు.