వాట్సాప్ వైద్యం వికటించి వ్యక్తి మృతి..?

By :  Ck News Tv
Update: 2025-02-20 07:03 GMT

వాట్సాప్ వైద్యం వికటించి వ్యక్తి మృతి..?

డాక్టర్ లేకుండానే కాంపౌండర్‌లు వైద్యం చేయడంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం చోటు చేసుకుంది.

మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన గూడెపు నాగేశ్వరావు (48) అనే వ్యక్తి అస్వస్థతకు గురికావడంతో చికిత్స నిమిత్తం కోదాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. మొదట వైద్యుడు పరిశీలించి స్కానింగ్, రక్త పరీక్షలకు ప్రిఫర్ చేశాడు. ఈ క్రమంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రిపోర్టులను ఆస్పత్రిలోని కాంపౌండర్లు చరవాణి ద్వారా వాట్సాప్‌కు పంపించారు. అనంతర డాక్టర్ వాట్సప్‌లోనే పలు ఇంజక్షన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేయమని చెప్పిడు. దీంతో కాంపౌండర్లు ఇంజక్షన్ చేయడంతో అది వికటించి విరోచనాలతో నాగేశ్వరరావు మృతి చెందినట్లుగా బంధువుల చెప్పుకొచ్చారు.

కానీ ఆస్పత్రి సిబ్బంది మాత్రం సదరు వ్యక్తికి సీరియస్‌గా ఉందని వేరే హాస్పటల్‌కు తరలించమని బంధువులకు తెలపడంతో వారు పట్టణంలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ పరిశీలించి ఏమీ చెప్పకుండా ఆసుపత్రి నుంచి వెళ్ళిపోయాడు. కానీ నాగేశ్వరావు కుటుంబ సభ్యులు మొదటి ఆస్పత్రిలోని సిబ్బంది ఇచ్చిన ఓవర్ డోస్ ఇంజక్షన్ వల్ల మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మృతుని బంధువులు ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే నాగేశ్వరరావు మృతి చెందాడని.. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఆస్పత్రికి వెళ్లి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.

Similar News