ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్‌ మహిళా ఎస్సై

ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్‌ మహిళా ఎస్సై;

By :  Ck News Tv
Update: 2025-02-26 05:30 GMT

ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్‌ మహిళా ఎస్సై


నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో మంగళవారం సాయంత్రం ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో పక్కా సమాచారం మేరకు సిబ్బందితో కలిసి సోదలు నిర్వహించగా ఎక్సైజ్ మహిళా ఎస్సై, ఓ మహిళా కానిస్టేబుల్ లంచం తీసుకునే విషయంలో పట్టుబడ్డారు.

భైంసా మండలంలోని ఓ గ్రామంలో ఇద్దరు తెల్ల కల్లు వ్యాపారులు తమకు అనుమతించిన పరిధిలో తెల్లకల్లు అమ్ముకునే విషయంలో వివాదం తలెత్తింది.

నిర్మల్‌ జిల్లాలోని కమోల్‌ గ్రామానికి చెందిన కల్లు వ్యాపారి సుభాష్‌ గౌడ్ ఇటీవల ఒకరు తెల్లకల్లు అమ్మకం తమకు కేటాయించిన పరిధి కాకుండా ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నారని ఫిర్యాదు చేశాడు.

బాధితుడి సుభాష్‌ గౌడ్‌ హద్దులోకి ఇతరులు రాకుండా చూసుకోడానికి .మహిళా ఎస్సె దాదాపు పదివేల రూపాయల లంచం అడిగినట్లు ఫిర్యాదు దారుడు ఏసీబీకి సమాచారం అందించాడు.

దీంతో పక్కా సమాచారం అందుకున్నటువంటి ఏసీబీ సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గా ఎస్సై, కానిస్టేబుల్ ని అదుపులోకి తీసుకున్నారు. కాగా నిర్మల్ లో గత ఆరు నెలల్లో 12వ ఏసీబి దాడులు కావడం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే...

Full Viewఆర్మ్‌డ్‌ రిజర్వు (ఏఆర్‌)లో పనిచేస్తున్న ఎస్‌ఐ వసూల్‌ రాజా అవతారం ఎత్తాడు.

స్టేషన్‌లలోనే అనేక కేసులను సెటిల్‌మెంట్‌ చేశాడు. ఇరుపక్షాల నుంచి భారీగా డబ్బులు దండుకున్నాడు. తాను ఒంగోలులోని కీలక పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐని అని చెప్పి వైద్యశాలలు, గ్రానైట్‌ వ్యాపారులు, ఇంజనీరింగ్‌ కళాశాలల యజమానులు, ప్రైవేటు పాఠశాలల నిర్వాహకుల నుంచి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడ్డాడు. గత వైసీపీ పాలనలో ఆయన అవినీతి వ్యవహారం నిర్విఘ్నంగా కొనసాగింది.

నెలక్రితం ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాల యజమాని నుంచి రూ.2లక్షలు తీసుకున్న ఆయన అడ్డంగా దొరికిపోయాడు. విషయం తెలుసుకున్న ఓ సీఐ ఆరా తీయడంతో అయ్యగారి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. దీంతో సదరు అవినీతి రవికిరణం వ్యవహారాన్ని ఎస్పీ దామోదర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. తీవ్రంగా పరిగణించిన ఆయన చర్యలకు సిఫార్సు చేసినట్లు సమాచారం. ఆర్ముడ్‌ రిజర్వులో ఉద్యోగం చేస్తూ తాలూకా పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐనని చెప్పుకుని వసూళ్ల రవికిరణం అనేక దందాలకు పాల్పడ్డాడు.

అవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నెల క్రితం ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాల యజమానికి ఫోన్‌ చేసి తాను ఫలానా స్టేషన్‌ ఎస్‌ఐని అంటూ పరిచయం చేసుకున్నాడు. తమ స్టేషన్‌లో ఖర్చులు ఉన్నాయి.. సీఐ గారు మాట్లాడమన్నారు అని చెప్పారు. ఆయన్ను ఒప్పించి రూ.2లక్షల నగదు తెచ్చుకున్నాడు.

సీఐ ఆరాతో బట్టబయలు

కళాశాల యజమాని నుంచి రూ.2లక్షలు వసూలు చేసిన విషయం సీఐ దృష్టికి రావడంతో ఆయన కాస్త కంగారు పడ్డారు. వెంటనే కళాశాల యజమానికి ఫోన్‌ చేసి.. ఆయనకు కాల్‌ చేసిన వ్యక్తి నంబరు సేకరించారు. దీంతో వసూళ్ల వ్యవహారం బట్టబయలైంది. ఏఆర్‌ ఎస్‌ఐని వెంటనే స్టేషన్‌కు పిలిపించి సీఐ నిలదీశారు.

అక్కడ జరిగిన విషయం సాక్ష్యాలతో బయటపెట్టడంతో సదరు ఏఆర్‌ ఎస్‌ఐ ఆయన కాళ్లావేళ్లాపడ్డాడు. తాను తప్పుచేశానని ఒప్పుకున్నాడు. అయితే ఈ విషయాన్ని సీఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

మచ్చుకు కొన్ని ఉదాహరణలు ఇవీ.. నగరంలో పేరు ఉన్న చర్మవ్యాధుల డాక్టర్‌ వద్దకు వెళ్లిన ఏఆర్‌ ఎస్‌ఐ.. పలానా చోట అయ్యప్ప భజన ఉందని వారికి కొంత సహాయం కావాలని అడిగాడు. ఓ గ్రానైట్‌ వ్యాపారికి ఫోన్‌ చేసి స్టేషన్‌ ఖర్చులకు కొంత నగదు పంపించాలని కోరాడు. ఓ ప్రైవేటు పాఠశాల యజమాని వద్దకు వెళ్లి మా ఉన్నతాధికారి ఓ గ్రామంలో చర్చి కడుతున్నారు.. అందుకు సహాయం కావాలని కోరాడు. రాజకీయ పలుకుబడి ఉన్న ఓ డాక్టర్‌ వద్దకు వెళ్లి స్టేషన్‌ ఖర్చులంటూ నగదు డిమాండ్‌ చేశాడు. ఇలా అనేక రకాలుగా గత ప్రభుత్వ హయాం నుంచి ఏఆర్‌ ఎస్‌ఐ లక్షల్లో దందాలకు పాల్పడినట్లు తేలింది.

కేసులలో పంచాయితీలు

నగరంలోని కీలక పోలీసు స్టేషన్‌లో నమోదయ్యే కేసులలో ఏఆర్‌ ఎస్‌ఐ తలదూర్చుతాడు. సెటిల్‌మెంట్‌ చేస్తానని అటు నిందితులకు, బాధితులకు చెబుతాడు. స్టేషన్‌లోకి వెళ్లి అధికారుల వద్ద మాత్రం తమ బంధువులకు సంబంధించిన కేసు అంటూ ప్రాథేయపడతాడు. వారికి మాయమాటలు చెప్పి ఏదో రకంగా కేసు నమోదు కాకుండా చేస్తాడు. ఆపైన బాధితులు, నిందితుల వద్ద డబ్బులు వసూలు చేయడం రివాజుగా మార్చుకున్నాడు. హోటల్స్‌కు వెళ్లి తాను ఆ ఏరియా ఎస్‌ఐనని చెప్పి బిర్యానీ ప్యాకెట్లు, తినుబండారాలు తెచ్చుకుంటాడని ప్రచారం ఉంది.

ఎస్పీకి ఫిర్యాదు చేసిన సీఐ

ఏఆర్‌ ఎస్‌ఐ దందాలపై నగరంలోని ఒక కీలక స్టేషన్‌ సీఐ ఎస్పీ దామోదర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన ఏఆర్‌ ఎస్‌ఐ దందాలపై విచారణ చేయించారు. అందులో ఏఆర్‌ ఎస్సై అవినీతి బాగోతాలు అనేకం వెలుగుచూశాయి. దీంతో 15రోజుల క్రితం ఎస్పీ దామోదర్‌ అతనిని హెడ్‌క్వార్టర్‌కు సరెండర్‌ చేసుకోవాలని గుంటూరు రేంజ్‌ ఐజీకి లేఖ రాసినట్లు సమాచారం. ఏఎస్‌ఐలు, ఎస్‌ఐలపై చర్యలు తీసుకునే అధికారం ఐజీకి ఉంటుంది. కాగా సదరు ఏఆర్‌ ఎస్‌ఐపై చర్యలు ఎలా ఉంటాయన్నది వేచి చూడాల్సి ఉంది. మరింత సమాచారం తెలియాల్సి వుంది>

Similar News