కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై

సీఎం రేవంత్ రెడ్డికి భారీ షాక్‌..;

By :  Ck News Tv
Update: 2025-02-21 11:23 GMT

సీఎం రేవంత్ రెడ్డికి భారీ షాక్‌.. కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై

కాంగ్రెస్‌పార్టీ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజీనామా చేశారు. 6 మార్చి 2024న కాంగ్రెస్ కండువా కప్పుకున్న కోనప్ప ఏడాది తిరగకముందే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు.

అయితే ప్రస్తుతం ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ చేరనని కూడా వెల్లడించారు. ఇక నుంచి స్వతంత్రంగా ఉంటానని తెలిపారు కోనేరు కోనప్ప.

సామాజిక సేవద్వారా గుర్తింపు పొందిన కోనేరు కోనప్ప వేసవికాలంలో సిర్పూర్ లో అంబలికేంద్రాలు నిర్వహించే వారు. దానితోనే ఆయన వెలుగులోకి వచ్చారు.

Full Viewఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన కోనప్ప 2004లో మొదటిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఓడిపోయారు. 2014లో బీఎస్పీ టికెట్ పై గెలిచారు.

అయితే నిర్మల్ నుంచి బీఎస్పీ టికెట్ పై గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి కోనప్ప నాటి అధికార పార్టీ టీఆర్ఎస్లో చేరారు.2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మళ్లీ గెలుపొందారు. కానీ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీచేసిన కోనప్ప బీజేపీ చేతిలో ఓడిపోయారు.

అయితే సిర్పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ లో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ కోనప్ప గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు.

తాజాగా సిర్పూర్లో కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న విబేధాల కారణంగానే కోనేరు కోనప్ప పార్టీని వీడుతున్నట్లు తెలిసింది. కాగా కోనప్ప గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

అయితే నిర్మల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఇంద్రకరణ్ రెడ్డి బీజేపీ చేతిలో ఓడిపోయి ఆతర్వతా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అయితే ప్రస్తుతం ఆయన కూడా కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే వీరిద్దరూ కూడా త్వరలో తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతారని ప్రచారం సాగుతోంది.

Similar News