నేను ఓడితే ముక్కు నేలకు రాస్తా: సీఎం రేవంత్

నేను ఓడితే ముక్కు నేలకు రాస్తా: సీఎం రేవంత్;

By :  Ck News Tv
Update: 2025-02-21 15:08 GMT

గత 10 ఏళ్ల పరిపాలన పై చర్చిద్దాం రండి: సీఎం రేవంత్ రెడ్డి!*


ఈ చర్చలో నేను ఓడితే ముక్కు నేలకు రాస్తా: సీఎం రేవంత్ రెడ్డి, ఘాటు వ్యాఖ్యలు


హైదరాబాద్:ఫిబ్రవరి 21

నారాయణపేట, ప్రజా పాలన ప్రగతి బాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. పేదవాడి ఆత్మ గౌరవం ఇందిరమ్మ ఇండ్లు అని అందుకే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వా లని నిర్ణయం తీసుకున్నా మన్నారు. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అలాగే పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు? :2004 నుంచి 2014 వరకు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిం దని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు ఏ గ్రామంలో పేదలకు ప్రభుత్వ ఇళ్లు దక్కలేదని....

ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని గుర్తు చేశారు. పది సంవత్సరాలు సీఎంగా ఉన్న కేసీఆర్‌ పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. అంతకు ముందు ఎంపీగా గెలిపిస్తే ఏనాడూ పాలమూరు గురించి పార్లమెంట్‌లో ప్రస్తావించలేదని అన్నారు.

తెలంగాణ సాధించుకున్న తరువాత కూడా ఈ జిల్లా కు న్యాయం జరగలేదని విమర్శించారు.కృష్ణా నీళ్లు రాయలసీమకు తరలించు కుపోతుంటే కేసీఆర్‌ నోరె త్తలేదు :గతంలో కొందరు సీఎంలు పాలమూరు పేరు చెప్పి రాజకీయం చేశారు కానీ, జిల్లాకు చేసిందేమీ లేదని రేవంత్​ ఆరోపించారు.

నెట్టెంపాడు, భీమ, సంగం బండం, కోయిల్‌సాగర్‌, కల్వకుర్తి ప్రాజెక్టుల పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. పది సంవత్సరాల్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబుతో పంచాయితీ ఉండేది కాదని తెలిపారు.

వైఎస్సార్, జగన్‌ పోతిరెడ్డి పాడు ద్వారా కృష్ణా నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతుంటే కేసీఆర్‌ నోరెత్తలేదని విమర్శించారు.ఓడితే ముక్కు నేలకు రాస్తా :తన మీద పగతో మక్తల్‌- నారాయణపేట-కొడంగల్‌ ప్రాజెక్టును పక్కన పడేశా రని సీఎం ఆరోపించారు.

ప్రజా పాలన సరిగా లేదని విమర్శలు చేస్తున్నారని అన్నారు. పదేళ్లు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారని, 12 ఏళ్ల నుంచి మోదీ ప్రధానిగా ఉన్నారని, 12 నెలలుగా కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉందని అన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి చర్చకు వస్తే ముఖ్యమంత్రిగా నేను సిద్ధమని, గత పదేళ్ల పాలనపై చర్చిద్దామని, ఈ చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తానని సవాల్‌ విసిరారు.

పది సంవత్సరాల్లో ఏమీ చేయని వాళ్లు ఏడాదిలోనే కాంగ్రెస్‌ ఏమీ చేయలేదని అంటున్నారని, పాలమూ రు జిల్లాలో ప్రాజెక్టులు, పరిశ్రమలను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మోసగాళ్ల మాటలు విని భూసేకర ణను అడ్డుకోవద్దని సూచించారు.

భూమి కోల్పోయిన వారికి మంచి పరిహారం ఇచ్చి న్యాయం చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.

"ప్రజా పాలన సరిగా లేదని విమర్శలు చేస్తున్నారు. పదేళ్లు కేసీఆర్‌ ముఖ్య మంత్రిగా ఉన్నారు. 12 ఏళ్ల నుంచి మోదీ ప్రధానిగా ఉన్నారు.

12 నెలలుగా కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌, బీఆర్​ఎస్​ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి చర్చకు వస్తే సీఎంగా నేను సిద్ధం. గత పదేళ్ల పాలనపై చర్చిద్దాం. రండి, ప్రాజెక్టులు పూర్తి చేసినందుకు మేము ప్రయత్నిస్తుంటే, చేతకాని వాళ్లు మమ్మల్ని అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి, ఘాటుగా వాక్యానించారు.

Similar News