రాష్ట్రంలో మరో కొత్త పథకం.. ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఆర్థిక సాయం

రాష్ట్రంలో మరో కొత్త పథకం.. ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఆర్థిక సాయం;

By :  Ck News Tv
Update: 2025-03-12 04:27 GMT

రాష్ట్రంలో మరో కొత్త పథకం.. ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఆర్థిక సాయం

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం రాజీవ్ యువవికాసం పేరిట కొత్త పథకాన్ని ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలోని 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక్కొక్కరికి రూ.3 లక్షల మేర ఆర్థిక సాయం అందజేస్తారు.

ఈ పథకానికి సంబంధించి ఈనెల 15న నోటిఫికేషన్​ విడుదల కానుంది. కార్పొరేషన్‌ల ద్వారా ఈస్కీమ్ కొనసాగనున్నది. బ్యాంకుల ద్వారా లింకేజీ అందిస్తారు. కాగా, ప్రభుత్వం మొత్తం రూ.6 వేల కోట్లను కేటాయించినట్లు తెలుస్తోంది.

అర్హులు వారే.. డిప్యూటీ సీఎం భట్టి

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వీరనారీ చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో జరిగిన మీడియా సమావేశంలో పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ పథకానికి 55 ఏండ్ల లోపు వారిని అర్హులుగా పేర్కొన్నామన్నారు. అర్హులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్​5 వరకు దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్​ 6 నుంచి మే 31లోగా పరిశీలన పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అర్హులైన వారికి మంజూరు పత్రాలను జూన్ ​2న అందిస్తామన్నారు. అర్హులైన వారిని ఎంపిక చేయడానికి మార్గదర్శకాలను అన్నింటిని నోటిఫికేషన్‌లో స్పష్టం చేస్తామన్నారు. ఈ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను పూర్తిగా విస్మరించిందన్నారు. కార్పొరేషన్‌లకు నిధులు కేటాయించలేదని విమర్శించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం బ్యాంకుర్లతో మాట్లాడి రుణం ఇప్పించే విధంగా కృషి చేస్తుందన్నారు. ఎంత సబ్సిడి ఉండేది నోటిఫికేషన్‌లో స్పష్టం చేస్తామన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటికీ మంగళవారం రూ.300 కోట్లు విడుదల చేసినట్లుగా డిప్యూటీ సీఎం తెలిపారు. మహిళా యూనివర్సిటిని అద్బుతంగా తీర్చిదిద్దం, హెరిటెజ్​ భవనాలను పరిరక్షించడం తదితర వాటిని చేస్తామని ఆయన తెలిపారు.

Similar News