కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు...
కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు...;
By : Ck News Tv
Update: 2025-03-08 06:34 GMT
కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు...
పెద్దవంగర పోలీస్ స్టేషన్ విశ్రాంతి గదిలో మద్యం సేవించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ రాజారామ్, కానిస్టేబుల్ సుధాకర్ మద్యం సేవించిన ఫోటోలు గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వచ్చారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీస్ శాఖ విచారణలో కానిస్టేబుళ్ల నిర్వాకం నిజమని తేలింది.
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడంతో మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.