మార్కెట్లో షార్ట్ సర్క్యూట్‌పై మంత్రి తుమ్మల ఆరా.. తక్షణమే అధికార యంత్రాంగం సంఘటన స్థలానికి చేరుకోవాలని ఆదేశంఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం రాత్రి జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు.ఖమ్మం మార్కెట్లో వ్యాపారులకు చెందిన పత్తి బస్తాలు షార్ట్ సర్క్యూట్‌తో ధగ్ధం కాగా... సంఘటన విషయం తెలిసిన మంత్రి తుమ్మల గారు అధికార యంత్రాంగాన్ని సంఘటన స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు.పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌తో మాట్లాడటంతో ఇతర అధికార యంత్రాంగాన్ని సైతం అప్రమత్తం చేశారు. మార్కెటింగ్, ఫైర్, పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి వెళ్ళిన పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విషయంమై నూతనంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నికైన యరగర్ల హన్మంతరావు, వైస్‌చైర్మన్ తల్లాడ రమేష్‌లను సైతం మార్కెట్‌ను సందర్శించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. సంఘటనపై ఆరా తీయండిమార్కెట్లో జరిగిన సంఘటన ఏ విధంగా జరిగింది.. ఏ సమయంలో జరిగింది.. ఇందుకు గల కారణాలను సైతం క్షుణ్ణంగా తెలుసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గాఉ ఆదేశించారు. సెలవు రోజుల్లో ఈ సంఘటన జరగటంపై సుధీర్ఘంగా వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.