Telangana
Trending

మోషన్ ఒలింపియాడ్ స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు

మోషన్ ఒలింపియాడ్ స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు

మోషన్ ఒలింపియాడ్ స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు

లింగంపల్లి, జూలై 19: చందానగర్‌లోని మోషన్ ఒలింపియాడ్ స్కూల్‌ ప్రాంగణంలో శనివారం బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో మరియు సాంస్కృతిక వైభవంతో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవంలో విద్యార్థులు పోతురాజు, మహాకాళి వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ దుస్తుల్లో పరిమళించిన విద్యార్థుల నృత్యాలు, పాటలు, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి.

ఈ కార్యక్రమానికి స్కూల్ ఛైర్మన్ శ్రీ ఉదయ్ రెడ్డి ముఖ్య అతిథి గా విచ్చేశారు, తెలంగాణ లో బోనాల పండుగ యొక్క విశిస్టత గురించి ప్రసంగించారు, పిల్లలను అభినందించారు. స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ సునీత బోనాల పండుగ గురించి వివరంగా వివరిస్తూ, ఇది మన పూర్వీకుల ఆచారాలను తెలియజేసే గొప్ప వేడుక అని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులను బహుమతులతో సత్కరించారు.

ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హాజరై పిల్లల ప్రతిభను మెచ్చుకున్నారు. బోనాల వేడుకలు స్కూల్ వాతావరణాన్ని ఓ ఆధ్యాత్మిక మహోత్సవంగా మార్చాయి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button