Telangana

ప్రజాపాలన దరఖాస్తుల పై ప్రజలు అపోహాలు వీడాలి…..

ప్రజాపాలన దరఖాస్తుల పై ప్రజలు అపోహాలు వీడాలి…..

ప్రజాపాలన దరఖాస్తుల పై ప్రజలు అపోహాలు వీడాలి…..

ఆలేరు మున్సిపల్ కమిషనర్ చక్రపాణి

సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) జనవరి 04

ప్రజాపాలన దరఖాస్తుల విషయంపై ప్రజలు అపోహాలు విడాలని ఆలేరు మున్సిపల్ కమిషనర్ చక్రపాణి అన్నారు.గురువారం ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ..ఆరు గ్యారంటీల దరఖాస్తుల విషయంలో దరఖాస్తు ఫారం కలర్ అయినా బ్లాక్ అండ్ వైట్ అయినా చెల్లుబాటు అవుతుందని అన్నారు.

దరఖాస్తు ఫారం తో పాటు రేషన్ కార్డులో ఉన్న కుటుంబ యజమాని పై దరఖాస్తు ఫిల్ చేసి కుటుంబ యజమాని ఆధార్ కార్డు, రేషన్ కార్డు అప్లికేషన్ ఫారంతో జత చేయవలెనని ఆయన విజ్ఞప్తి చేశారు.కుటుంబ సభ్యుల వివరాల కాలంలో కుటుంబ పేరు,యజమానికి సంబంధం, పుట్టిన తేదీ,ఆధార్ కార్డు నెంబరు నింపవలెనని ఆయన దరఖాస్తుదారులకు కోరారు.

ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఉచితంగా దరఖాస్తులు తీసుకొని నింపి వార్డులో జరిగే ప్రజా పాలన కార్యక్రమంలో ఇవ్వవలెనని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button