Telangana

30 లక్షలు విలువగల గంజాయి పట్టివేత

30 లక్షలు విలువగల గంజాయి పట్టివేత

30 లక్షలు విలువగల గంజాయి పట్టివేత

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

జనవరి 01,

కొత్తగూడెం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్తగూడెం ఎస్పీ వినీత్, ఇల్లందు డిఎస్పి రమణమూర్తి, టేకులపల్లి సిఐ ఇంద్రసేనారెడ్డి, వివరాలు వెల్లడిస్తూ టేకులపల్లి పోలీస్ స్టేషన్ టేకులపల్లి ఎస్ఐ గన్ రెడ్డి రమణారెడ్డి వాహనా తనిఖీలు నిర్వహిస్తుండగా విశ్వసనీయ సమాచారం ప్రకారం గత నెల 28వ తారీఖున ఉదయం 10 గంటల సమయంలో కేఏ 38 ఏ 3677 టాటా ఇంట్రా ట్రాలీ వాహనంలో గంజాయి తరలిస్తున్నారు.

టేకులపల్లి సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారని విషయం తెలుసుకున్న గంజాయి తరలిస్తున్న వాహనం టేకులపల్లి పెట్రోల్ బంక్ వెనుకవైపు వదిలేసి పారిపోయారు. స్థానికులు గమనించి అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని టేకులపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా టేకులపల్లి ఎస్సై రమణారెడ్డి తన సిబ్బందితో వాహనాన్ని తనిఖీ చేయగా మూడు బీరువాలు కనపడ్డాయి.

గ్యాస్ కట్టర్ ద్వారా బీరువాలు తెరిచి చూడగా ఒక బీరువా ఖాళీగా ఉండగా రెండు బీరువాల్లో గంజాయిని గుర్తించారు. గంజాయిని దాచిపెట్టి రెండు బీరువాలు పైకి చూడడానికి ఖాళీగా కనిపించాయి. పోలీసులను బీరువా వెనుక భాగంలో గమనించగా 120 కేజీల గంజాయి సుమారు గంజాయి విలువ 30 లక్షలు గా ఉంటుందని తెలిపారు పోలీసులు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button