PoliticalTelangana

మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసిన కానిస్టేబుల్..

మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసిన కానిస్టేబుల్..

మద్యం మత్తులో యాక్సిడెంట్ చేసిన కానిస్టేబుల్..

మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిస్తూ పోలీసు ఉన్నతాధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

పై అధికారుల మాటలు పెడ చెవిన పెడుతూ కొంతమంది కింది స్థాయి పోలీస్ సిబ్బంది రూల్స్ తమకు పట్టవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వేములవాడ పట్టణంలో ఓ కానిస్టేబుల్ ఏకంగా యూనిఫాంలోనే మద్యం సేవించినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతటితో ఆగకుండా వాహనం నడిపి చిన్నపాటి యాక్సిడెంట్ కు కారణమైనట్లుగా తెలుస్తుంది.

దీంతో సదరు వాహనదారుడు కానిస్టేబుల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాగి వెహికల్ ఎలా డ్రైవ్ చేస్తావని తమ కుటుంబానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వాహనదారుడు సదరు కానిస్టేబుల్ ను నిలదీశాడు.

మద్యం మత్తులో ఉన్నట్లుగా ఆరోపించబడుతున్న కానిస్టేబుల్ వేములవాడ పట్టణానికి చెందిన సూగూరి పృథ్వీరాజ్ కాగా నిజామాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్నట్లు ప్రాథమికంగా తెలియ వచ్చింది.

ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button