BhadrachalamPoliticalTelangana

ఆటో డ్రైవర్‌ను అడ్డగించి చితకబాదిన దుండగులు.. తీవ్ర గాయాలు

ఆటో డ్రైవర్‌ను అడ్డగించి చితకబాదిన దుండగులు.. తీవ్ర గాయాలు

ఆటో డ్రైవర్‌ను అడ్డగించి చితకబాదిన దుండగులు.. తీవ్ర గాయాలు

Web desc : పాల్వంచ పట్టణంలో మరోసారి రౌడీ మూకల ఆగడాలు కలకలం రేపుతున్నాయి. స్థానిక వికలాంగుల కాలనీలో నివాసం ఉంటున్న యువకుడు పోతురాజు నవీన్‌పై జరిగిన దాడి ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

వృత్తిరీత్యా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న నవీన్(27) ప్రస్తుతం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనపై పాత కక్షల నేపథ్యంలోనే దాడి జరిగిందని బాధితుడు ఆరోపించాడు.

సాగర్ అనే వ్యక్తి ప్రేరేపణతో నజీర్ తనపై దాడికి పాల్పడ్డారని నవీన్ పేర్కొన్నాడు. తనను అడ్డగించి విచక్షణారహితంగా కొట్టారని, ప్రాణహాని కలిగించేలా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు అధికారులను కోరాడు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. బాధితుడి ఆరోపణలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని తెలుస్తోంది. పట్టణంలో శాంతిభద్రతలను కాపాడాలని స్థానిక ప్రజలు పోలీసు అధికారులను కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button