
ప్రైవేటు బస్సులో చెలరేగిన మంటలు.. బస్సులో 40 మంది ప్రయాణికులు
నల్గొండ జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. కానీ ఈ ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని లింగంపల్లి నుంచి ఏపీలోని కాకినాడకు ఓ ప్రైవేటు బస్సు శుక్రవారం రాత్రి బయల్దేరింది.
నల్లగొండ జిల్లాలో వెళ్తున్న సమయంలో అర్ధరాత్రి 2.15 గంటలో బస్సు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్.. బస్సును నిలిపివేశాడు. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను అప్రమత్తం చేసి.. కిందకు దించేశాడు. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేసింది. బస్సు క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం సంభవించక పోవడంతో బస్సు డ్రైవర్, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.




