EducationHyderabadTelangana

రేపే తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల..

రేపే తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న నిరుద్యోగులు

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2024) ఫలితాలు జూన్‌12న వెల్లడి కానున్నాయి. ఇప్పటికే టెట్‌ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ ఆన్సర్‌ కీ విడుదల చేయగా..

దానిపై అభ్యంతరాలు స్వీకరించి తుది ఆన్సర్‌ కీని రూపొందించింది. రేపు ఫైనల్‌ ఆన్సర్‌ కీతోపాటు ఫలితాలను వెల్లడించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. కాగా తెలంగాణ టెట్‌ పరీక్షలు మే 20 నుంచి జూన్‌ 2 వరకు జరిగిన సంగతి తెలిసిందే.

తొలిసారి రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు. ఈ సారి టెట్‌ పరీక్షలకు 2,86,381 దరఖాస్తు చేసుకోగా.. వారలో పరీక్షలకు 2,36,487 మంది హాజరయ్యారు.

పేపర్‌ వారీగా చూస్తే.. పేపర్‌-1కు 99,958 మంది దరఖాస్తు చేసుకోగా 86.03 శాతం మంది హాజరయ్యారు. ఇక పేపర్‌-2కి 1,86,423 మంది దరఖాస్తులు చేసుకోగా.. వారిలో 82.58 శాతం మంది హాజరయ్యారు.

టెట్‌ పరీక్షకు తెలుగు రాష్ట్రాల్లో యమ డిమాండ్‌ ఉంటుంది. డీఎస్సీ నియామకాల్లో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

అలాగే ప్రభుత్వ టీచర్‌ పోస్టుల నియామకాలకు నిర్వహించే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) రాసేందుకు టెట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించవల్సి ఉంటుంది.

అందువల్లనే బీఎడ్, డీఎడ్‌ పూర్తి చేసిన అభ్యర్ధులు ప్రతీసారి టెట్‌ పరీక్షలో అధిక స్కోర్ సాధించేందుకు అధిక సంఖ్యలో పోటీపడుతుంటారు. మరోవైపు ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో టెట్‌ పరీక్ష నిర్వహించిన అక్కడి సర్కార్‌ ఇప్పటి వరకూ ఫలితాలు వెల్లడించలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button