BhadrachalamPoliticalTelangana

మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసిన ఎస్పీ..…స్టెప్పులకు నెటిజన్లు ఫిదా..

మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసిన ఎస్పీ..…స్టెప్పులకు నెటిజన్లు ఫిదా..

మాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసిన కొత్తగూడెం ఎస్పీ…..స్టెప్పులకు నెటిజన్లు ఫిదా.. (వీడియో)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మరోసారి తనదైన డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన ఏజెన్సీ జిల్లాల్లో పార్లమెంట్ ఎన్నికల బందోబస్తును సక్సెస్ ఫుల్ గా నిర్వహించిన సందర్భంగా గెట్ టు గెదర్ పార్టీ ఏర్పాటు చేశారు.

పాల్వంచలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఈ పార్టీలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పోలీస్ సిబ్బందితో కలిసి సరదాగా డ్యాన్స్ చేసి అలరించారు. ఎప్పుడు తనిఖీలు, కేసుల వేటలో బిజీగా ఉండే పోలీసు అధికారులు ఇలా కాస్త రిలాక్స్ గా తెలుగు పాటలకు స్టెప్పులు వేసి అదరహో అనిపించారు.

జిల్లా ఎస్పీ సైతం తమతో పాటు డ్యాన్స్ చేసేందుకు కాలు కదపడంతో సిబ్బంది అంతా చిల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా డ్యూటీలో తనదైన పనితీరుతో వ్యవహరించే ఎస్పీ రోహిత్ రాజ్ కాలేజీ డేస్ నుంచే డ్యాన్స్ లోనూ ఇరగదీసేవారట. గతంలోనూ ఆయన చేసిన డ్యాన్స్ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button