
మహిళా డాక్టర్‌పై దా*డి…
Web desc : మహారాష్ట్రలో ఓ మహిళా డాక్టర్‌పై దాడి ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తాలేగావ్ శ్యామ్‌జీపంత్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.
మెడికో లీగల్ కేసుకు సంబంధించి పోలీసులు వైద్య పరీక్ష కోసం తీసుకొచ్చిన ఓ వ్యక్తి అక్కడి మహిళా డాక్టర్‌పై అకస్మాత్తుగా చేయి చేసుకున్నాడు. ఇలా ఎందుకు చేశాడనేది మాత్రం తెలియరాలేదు.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, వైద్య పరీక్షలు పూర్తయ్యాక ఆ డాక్టర్ సంబంధిత డాక్యుమెంట్స్‌పై సంతకాలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు తీసుకువచ్చిన వ్యక్తి ఆమె ఎదురుగా కూర్చున్నాడు. పక్కనే ఓ పోలీసు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఆ డాక్టర్ సంతకాలు చేయమని ఆ వ్యక్తికి పెన్ను ఇచ్చారు.
సంతకం చేసిన తరువాత అతడు అకస్మాత్తుగా డాక్టర్‌పై చేయి చేసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసు అతడిని నిలువరించి గది నుంచి బయటకు లాక్కెళ్లారు. ఈ ఘటనపై స్థానిక వైద్య సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాసేపు నిరసనకు దిగారు.
డాక్టర్‌పై చేయి చేసుకున్న వ్యక్తి మరో మహిళపై బ్లేడుతో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు తెలిపారని వార్ధా జిల్లా వైద్యాధికారి తెలిపారు. పోలీసులు ఆ వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.



