PoliticalSPORTSTelanganaVikarabad

వికారాబాద్‌లో మహిళా క్రికెటర్‌ ఆత్మ*హత్య

వికారాబాద్‌లో మహిళా క్రికెటర్‌ ఆత్మ*హత్య

వికారాబాద్‌లో మహిళా క్రికెటర్‌ ఆత్మ*హత్య

ఇటీవలే అండర్‌-19 జట్టుకు ఎంపిక!

వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 17 ఏళ్ల మహిళా క్రికెటర్ ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. యాలాల్ మండలం సంగయ్యపల్లికి చెందిన నందిని అనే 17 ఏళ్ల యువతి చదువుతో పాటు క్రికెట్‌లోనూ రాణిస్తోంది.

ఆమెకు క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తూ కోచింగ్ ఇప్పించడం ప్రారంభించారు. దీంతో నందిని వికారాబాద్‌లో క్రికెట్ శిక్షణ తీసుకుంటోంది. అయితే, ఆమె ప్రతిభను గుర్తించిన బీసీసీఐ ఇటీవలే నందినిని భారత అండర్-19 మహిళల జట్టుకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. కానీ, ఇద్దరు దుర్మార్గుల వేధింపులు ఆమె ఆశలను ఆవిరి చేశాయి.

వారి వేధింపులు తట్టుకోలేక తీవ్ర మానసిక వేదనకు గురైన నందిని.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.మరికొన్ని రోజుల్లోనే దేశం తరఫున క్రికెట్ ఆడుతుందని ఆశించిన కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

వేధింపులే కారణమంటున్న బాధిత కుటుంబం
స్థానికంగా ఉండే ఇద్దరు విద్యార్థుల వేధింపులే తమ కూతురు మరణానికి కారణమని నందిని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ప్రేమ పేరుతో ఓ యువకుడు గత కొద్దిరోజులుగా నందినిని మానసిక వేదనకు గురిచేస్తున్నాడని, అతనికి మరోక వ్యక్తి సహకరిస్తూ వేధింపులకు పాల్పడ్డాడని వారు ఆరోపించారు. వారి వేధింపులు తట్టుకోలేకనే నందిని ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

నందినిని వేధించిన యువకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ.. వికారాబాద్ పట్టణంలో కుటుంబ సభ్యులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో టౌన్ లో ట్రాఫిక్ నిలిచిపోయింది. మంచి భవిష్యత్తు ఉన్న నందిని జీవితాన్ని నాశనం చేశారని.. యువకులకు శక్ష పడేవరకు వదిలేది లేదని రాస్తారోకో నిర్వహించారు.

దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే నందిని ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. పోలీసుల దర్యాప్తు తర్వాత అసలు విషయాలు బయటకొచ్చే ఛాన్స్ ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button